Zee Telugu Kutumbam Awards 2021: హేమను కించపరిచిన ప్రదీప్.. శివ బాలాజీతో నాటి ఘటనపై సెటైర్
అదేంటో.. సినిమా నటీనటులకు సంబంధించిన గతాన్ని ఏ ఒక్కరూ మర్చిపోవడం అంత ఈజీగా జరిగే పని కాదు. ముఖ్యంగా నేటితరం బుల్లితెర ప్రోగ్రాం నిర్వాహకులైతే గత జ్ఞాపకాలను నెమరు వేసేలా చేస్తున్న సీన్స్ భలే ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఈవెంట్‌లో శివ బాలాజీతో మాట్లాడుతూ హేమపై పరోక్షంగా సెటైర్ వేసేశాడు యాంకర్ ప్రదీప్.

Anchor Pradeep Comments on Shiva Balaji
in Zee Telugu Kutumbam Awards 2021
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం అట్టహాహాసంగా జరిపారు. ఈ వేడుకలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా, హీరోయిన్స్ కృతి శెట్టి, మెహ్రీన్, తమన్నా, నిహారిక, జబర్దస్త్ జడ్జ్ రోజా సహా తన సతీమణి మధుమితతో కలిసి శివబాలాజీ హాజరయ్యారు. జీ తెలుగులో బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చిన విజేతలకు అవార్డ్స్ అందిస్తూ అంతా సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోగ్రాం రేపు (అక్టోబర్ 31) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఈవెంట్ తాలూకు ప్రోమో రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో వేదికపై శివ బాలాజీతో యాంకర్ ప్రదీప్ బెహేవ్ చేసిన విధానం హైలైట్ అయింది. రీసెంట్‌గా జరిగిన ‘మా’ ఎన్నికల్లో నటి హేమ, శివ బాలాజీ చేయి కొరికిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ జరుగుతుండగా చోటుచేసుకున్న ఈ ఉదంతం హాట్ ఇష్యూ అయింది. అయితే దాన్ని గుర్తు చేసేలా అంతా బాగానే ఉన్నారా? అంటూ వేదికపైకి వచ్చిన శివా బాలాజీ చేయి పట్టుకొబోయాడు ప్రదీప్. దీంతో రియాక్ట్ అయిన శివ బాలాజీ ఏయ్.. ఏయ్.. అక్కడ వద్దు.. ఇక్కడ పట్టుకో అని మరో చేయి చూపించాడు. దీంతో రోజా సహా అంతా తెగ నవ్వుకున్నారు.
