Krithi Shetty : ఆ లెటర్‌ను ప్రేమ్ కట్టించుకుని దాచుకున్న కృతిశెట్టి.. ఇంతకీ ఏంటా లెటర్?
Krithi Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కృతి శెట్టి పేరు మారుమోగిపోతోంది. 2021లో రిలీజ్ అయిన ఉప్పెన మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్ము.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. హీరో వైష్ణవ్ తేజ్‌కు సైతం ఇదే ఫస్ట్ మూవీ కావడం గమనార్హం. ఇక ఈ మూవీలో బేబమ్మ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది కృతి. తన అభినయం, అందంతో యూత్ గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఆమెకు మూవీ ఆఫర్స్ వరస కట్టాయి. ఈ టైంలోనే నేచురల్ స్టార్ నానీతో కలిసి శ్యామ్ సింగరాయ్ మూవీ చేసింది.
తాజాగా అక్కినేని నాగార్జున యాక్ట్ చేసిన బంగార్రాజు మూవీలోనూ హీరోయిన్ గా నటించే చాన్స్ కొట్టేంది.ఈ రెండు మూవీలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. బంగార్రాజు మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. దీంతో ఈ అమ్మడు ఫస్ట్ మూడు మూవీస్ తోనే హైట్రిక్ అందుకుంది.తాజాగా ఆలీతో సరదగా ప్రోగ్రాంలో కృతి శెట్టి పాల్గొంది. తన లైఫ్ లోని కొన్ని విషయాలను ప్రోగ్రాంలో షేర్ చేసుకుంది. ఉప్పెన మూవీ సక్సె్స్ చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడటంతో ఎగిరి గంతేసిందట.

chiranjeevi who gave the letter to krithi shetty
Krithi Shetty : ఆ లెటర్ ఇచ్చింది ఎవరు? అందులో ఏముంది?
ఆయన తన గురించి మాట్లాడటమే పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చింది. ఉప్పెన మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి స్వయంగా ఒక లేటర్ రాసి, గిఫ్ట్ బాక్స్ సైతం కృతికి పంపించారట. ఆ లెటర్‌లో యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని రాసి ఉందట. దీంతో ఆమె తెగ సంబరపడిపోతూ ఆ లెటర్‌ను ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నదట. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ బేబమ్మ.. రామ్ యాక్ట్ చేస్తున్న దివారియర్, సుధీర్ బాబు యాక్ట్ చేస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్న మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో బిజీ బిజీగా గడుపుతోంది.