Chiranjeevi Jr NTR : క్రేజీ మల్టీ స్టారర్.. రాజమౌళి డైరెక్షన్‌లో హీరోలుగా చిరంజీవి, తారక్.. ఎప్పుడంటే!
Chiranjeevi Jr NTR: దాదాపుగా అందరూ చాలా సార్లు ఏవేవో ప్లాన్స్ వేసుకుంటు ఉంటారు. కానీ, అవి ఏదేని కారణాల వలన అలా వాయిదా పడుతూనే ఉంటాయి. అలా వాయిదా పడిన పనులు చాలానే ఉంటాయి. సినీ ఇండస్ట్రీలోనూ ఇటువంటి విషయాలు చాలా సార్లు జరిగి ఉంటాయి. తాజాగా ప్రొడ్యూసర్ గిరి అలా తాను నిర్మించాలనుకున్న ఓ క్రేజీ మల్టీ స్టారర్ గురించి తెలిపాడు.ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించారు. ఆ తర్వాత కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు కూడా చిత్రాలు చేశారు.
కానీ, ఆ తర్వాత వచ్చిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేశ్ లు అంతగా మల్టీస్టారర్ మూవీస్ చేయలేకపోయారు. అందుకు చాలా కారణాలుంటాయి. సరైన కథ దొరకకపోవడంతో పాటు అలా సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యం చేయలేకపోయి ఉంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆవుల గిరి మల్టీస్టారర్ ఫిల్మ్స్‌కు శ్రీకారం చుట్టాలని భావించారట. అందుకుగాను హీరోలుగా మెగాస్టార్ చిరు, యంగ్ టైగర్ తారక్ లను సెలక్ట్ చేసుకుని, డైరెక్టర్ గా రాజమౌళిని ఫిక్స్ చేసుకున్నాడట.

crazy multi starrer movie in tollywood chiranjeevi Jr Ntr WIth Rajamouli
Chiranjeevi Jr NTR : తండ్రితో చేయలేకపోయినా.. తనయుడితో..
ఈ విషయమై చిరంజీవిని కలిసి ఆయనకు చెప్పారట. చిరు కూడా ఓకే చెప్పాడట. కానీ, కథ బాగుండాలని, అలా బాగుంటే తప్పకుండా చేద్దామని అన్నారని తెలిపాడు ప్రొడ్యూసర్ గిరి. ఇక కథగా రాజస్థాన్‌లోని మేవార్ రాజు మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ స్టోరి.. సరిపోతుందని అనుకున్నారట. కానీ, ఎందుకో ఆ పిక్చర్ మెటీరియలైజ్ కాలేదు. అలా ఆ ప్రాజెక్టు అలానే ఆగిపోయింది. కానీ, డెస్టినీ ఉన్నట్లుంది. రాజమౌళి డైరెక్షన్ లో చిరంజీవి, రామ్ చరణ్ సినిమా చేశారు. తారక్ .. చిరుతో సినిమా చేయలేకపోయినా ఆయన తనయుడు రామ్ చరణ్ తో సినిమా చేశారు. అలా క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కింది. ఈ గ్రాండియర్ మూవీ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల కానుంది.