Daaku Maharaaj OTT : డాకు మ‌హ‌రాజ్ ఓటీటీపై క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daaku Maharaaj OTT : డాకు మ‌హ‌రాజ్ ఓటీటీపై క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఇదే..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2025,9:22 pm

ప్రధానాంశాలు:

  •  Daaku Maharaaj OTT : డాకు మ‌హ‌రాజ్ ఓటీటీపై క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఇదే..!

Daaku Maharaaj OTT : ఈ సారి సంక్రాంతికి sankranti రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan, Balakrishna బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ Venkatesh సినిమాలు విడుద‌ల కాగా, రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అయితే బాల‌కృష్ణ Balakrishna  న‌టించిన డాకు మ‌హ‌రాజ్ మాస్ హిట్ కొట్టింది. సాధారణంగా పండగల సమయంలో దర్శకుడు బాబీ సినిమాలు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి.డాకు మహారాజ్ Daaku Maharaaj సినిమా కూడా అదే విధంగా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం కొసమెరుపు. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది.

Daaku Maharaaj OTT డాకు మ‌హ‌రాజ్ ఓటీటీపై క్రేజీ అప్‌డేట్‌ రిలీజ్ డేట్ ఇదే

Daaku Maharaaj OTT : డాకు మ‌హ‌రాజ్ ఓటీటీపై క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఇదే..!

Daaku Maharaaj OTT ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

అయితే ఎన్ని కోట్లకు డీల్ సెట్ అయిందో అధికారిక ప్రకటన రాలేదు. కానీ, డాకు మహారాజ్’ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే..ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి సినిమా స్ట్రీమింగ్ కావాలి. దీనిని బట్టి డాకు మహారాజ్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 10 తరువాత నెట్ ఫ్లిక్స్ netflix లో తెలుగు Telugu , Tamil తమిళం, Malayalam మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్రకటన విడుదల చేసే అవకాశముంది.. డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా Daaku Maharaaj OTT డాకు మహారాజ్ డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే.. డాకు మహారాజ్ ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 124 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. వీకెండ్ కావడంతో రోజు కలెక్షన్లు పుంజుకునే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య విన్నర్ గా నిలిచారు. అలాగే.. బాలయ్య కేరీర్ లో వరుసగా నాలుగు సార్లు రూ. 100 కోట్ల వసూలు రాబట్టి నయా రికార్డు క్రియేట్ చేశారు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.సితార నిర్మాతలు స్పందిస్తే ఈ సినిమా ఓటీటీ డీల్ గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది