Dil Raju : రాజ‌కీయాల్లోకి దిల్ రాజు.. నిజ‌మెంత‌? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dil Raju : రాజ‌కీయాల్లోకి దిల్ రాజు.. నిజ‌మెంత‌?

 Authored By sandeep | The Telugu News | Updated on :15 June 2022,6:00 am

Dil Raju : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ నిర్మాత ఎవ‌రంటే దిల్ రాజు అని చెప్పవ‌చ్చు. నిర్మాత‌గానే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్‌గా మంచి విజ‌యాలు సాధించాడు దిల్ రాజు. ఈ నిర్మాత త్వ‌ర‌లో రాజ‌కీయాల‌లోకి రానున్న‌ట్టు స‌మాచారం. చ‌ల‌న‌చిత్ర రంగంలో ప్ర‌జ‌ల అభిమానాన్ని గెలుచుకున్న త‌ర్వాత ఇంకా మ‌నం సాధించాల్సింది ఏమైనా ఉందా? అనే ప్రశ్న విజ‌య‌వంత‌మైన వ్య‌క్తుల్లో అంకురిస్తుంది. అప్పుడు వారి ఆలోచ‌న‌, వారి చూపు రాజ‌కీయాల‌వైపు ప‌డుతుంది. శాస‌న‌స‌భ కావ‌చ్చు.. శాస‌న‌మండ‌లి కావ‌చ్చు.. రాజ్య‌స‌భ కావ‌చ్చు.. లోక్‌స‌భ కావ‌చ్చు.. ఏద‌న్నా కానీ రాజ్యాంగం క‌ల్పించిన అధికారాన్ని వినియోగించుకోవాల‌నే కోరిక జ‌నియిస్తుంది.

ఎమ్మెల్యేనో, మంత్రో, ఎంపీనో అవ‌డ‌మే అంతిమ ల‌క్ష్యాన్ని ఎంచుకుంటారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి పోటీచేయాల‌ని దిల్ రాజు ప్ర‌య‌త్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. త‌ర్వాత ఏమైందోకానీ ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. సొంత జిల్లా నిజామాబాద్ కాబ‌ట్టి ఎన్నిక‌ల్లో పోటీ కూడా అక్క‌డినుంచే ఉండ‌బోతోంది. ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? ఎంపీగా పోటీచేస్తారా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. అయితే పార్టీ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర స‌మితే కావ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. శాసనమండలి, రాజ్యసభ లాంటివి కాకుండా నేరుగా ప్రజల మధ్యే పోటీచేసి ఎమ్మెల్యేగాకానీ, ఎంపీగాకానీ ఎన్నికవ్వాలనేది దిల్ రాజు ఆలోచన అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

dil raju enter into politics

dil raju enter into politics

Dil Raju : వాస్త‌వ‌మెంత‌?

మ‌రి వీటిపై క్లారిటీ ఏంటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు రీసెంట్‌గా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. దిల్ రాజు ఆస్థానంలో సరైన కమర్షియల్ డైరక్టర్లు లేరు. ఉన్నది ఒక్కరే..అనిల్ రావిపూడి. అందుకే ఆయనను వదులుకోలేకపోతున్నారు దిల్ రాజు. ఇప్పటికి అయిదు సినిమాలు చేసారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఓ సినిమా బయట చేయాల్సి వుంది. అది కూడా ఈనాటి కమిట్ మెంట్ కాదు. ఎప్పుడో రాజా దీ గ్రేట్ నాటిది. పాపం ఆ నిర్మాత అలా వెయిటింగ్ లో వున్నారు. ఇన్నాళ్లకు చాన్స్ వచ్చింది. బాలయ్య-రావిపూడి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది