Intinti Gruhalakshmi 17 May Today Episode : తులసికి దొరికిన జాబ్.. జాబ్ పోయిన టెన్షన్ లో నందు షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 17 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 634 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోపంతో ఇంటికి వస్తుంది దివ్య. డాడీ ఎందుకు కాలేజీకి వచ్చారు. ఆయన ఫీజు కట్టడానికి వచ్చారు అంటుంది దివ్య. అయినా.. ఆయనెందుకు వచ్చారు అంటుంది. అవునా.. కాలేజీ వాళ్లు ఆయనకు ఫోన్ చేసి ఉంటారు. అందుకే వచ్చి ఉంటారు అంటుంది తులసి. ఆయనకు మీ మీద అఫెక్షన్ లేనప్పుడు.. మా మీద కూడా ఉండకూడదు. మీ బాధ్యతతో పనిలేదు.. మామ్ చూసుకుంటుంది అని గట్టిగా చెప్పాను అంటుంది దివ్య. దీంతో అనవసరంగా ఆయన్ను ఇబ్బంది పెట్టావు దివ్య. ఆయన్ను తక్కువ చేసి మాట్లాడకు. అది నా పెంపకానికే అవమానం అంటుంది తులసి.
intinti gruhalakshmi 17 may 2022 full episode
డాడ్ నిన్ను బాధపెట్టారు.. అవమానించారు.. అది మరిచిపోయావా మామ్ అంటుంది తులసి. నాకు డాడ్ అంటే ఇష్టమే కానీ.. ఈ డాడ్ అంటే కాదు. మా మమ్మీని ఇష్టపడే డాడీ అంటేనే నాకు ఇష్టం అంటుంది దివ్య. చిన్నపిల్ల అయినా దివ్య కరెక్ట్ గానే ఆలోచిస్తోంది అమ్మ అంటాడు పరందామయ్య. మా గొడవల వల్ల వాళ్లు తండ్రి ప్రేమకు దూరం కావద్దు. వాళ్లు తండ్రి ప్రేమకు దూరం కావద్దు అంటుంది తులసి. వాళ్లకు తండ్రి ప్రేమను దూరం చేసే హక్కు నాకు లేదు అంటుంది తులసి. దివ్య ఫీజు విషయంలో తనకు అవమానం జరగడంతో కోపంతో ఇంటికి వస్తాడు నందు. ఇంటి దగ్గర దివ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు నందు.
దివ్య నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు నందు. ఇంతలో అక్కడికి లక్కీ వస్తాడు. లక్కీని చూసి దగ్గరికి పిలుస్తాడు నందు. కానీ.. లక్కీ రానంటాడు. పర్లేదురా నాన్న అంటాడు. మీరు ఇంట్లో లేరనుకున్నాను అంటాడు లక్కీ.
దీంతో అతడి దగ్గరికి వెళ్తాడు నందు. నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు అని అడుగుతాడు నందు. దీంతో మీ ముఖం చూస్తే అందరికీ భయం వేస్తుంది.. ఒక మా మమ్మీకి తప్ప అంటాడు లక్కీ. ఈరోజు నుంచి నన్ను అంకుల్ అని కాకుండా డాడీ అని పిలువు అంటాడు నందు.
దీంతో నేను పిలవను అంటాడు లక్కీ. మీరంటే నాకు ఇష్టం లేదు అంటాడు లక్కీ. తులసి ఆంటిని వదిలేసి.. మా మమ్మీతో ఎందుకు ఉంటున్నారు అంటాడు. మీరు రాకముందు మా మమ్మీ నన్ను బాగా చూసుకునేది. కానీ.. మీరు వచ్చినప్పటి నుంచి నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అంటాడు లక్కీ.
Intinti Gruhalakshmi 17 May Today Episode : ఇంటి ఓనర్ భర్తతో గొడవ పెట్టుకున్న ప్రేమ్
మరోవైపు ప్రేమ్ కు కోపం వస్తుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఇంటి ఓనర్ భర్త అక్కడికి వస్తాడు. తనను చిరాకు పెడతాడు. మీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు ప్రేమ్. దీంతో కోపం వచ్చి ఇద్దరు కలిసి గొడవ పెట్టుకుంటారు.
కట్ చేస్తే ఉదయం అవుతుంది. తులసి పార్కులో యోగా చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు పిల్లలు సరిగమప అని సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. వాళ్లు సరిగ్గా పాడకపోవడంతో అలా కాదు..ఇలా అని చెప్పి వాళ్లకు పాడి చూపిస్తుంది తులసి.
మీరు చాలా బాగా పాడారు. కాస్త దృష్టి పెట్టండి అంటుంది తులసి. మరోవైపు తన తల్లి వచ్చి మా పిల్లలకు నేర్పించండి అంటుంది. మీకు ఇబ్బంది లేకపోతే మా పిల్లలకు నేర్పించండి అంటుంది. పిల్లలు కూడా నేర్పించు అంటారు. దీంతో సరే అంటుంది తులసి.
మరోవైపు ఇంట్లో దివ్య, పరందామయ్య కలిసి సరదాగా చెస్ ఆడుతూ ఉంటారు. దివ్యకు తులసి వచ్చి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.