Intinti Gruhalakshmi 18 Jan Today Episode : తులసికి మళ్లీ క్యాన్సర్ రూపంలో ప్రాణగండం.. నందు మీద తులసికి పెరిగిన ప్రేమ.. ఇంతలో తులసికి భారీ షాక్ ఇచ్చిన లాస్య
Intinti Gruhalakshmi 18 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 532 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి ఏదో విషయంపై సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అది ఏ విషయమో అర్థం కాదు. మనోజ్ చెప్పింది ముమ్మాటికీ నిజం అని అనుకుంటాడు. నేను ఎలాగైనా రాజును అవుతాను అనుకుంటాడు. అయి తీరుతాను అనుకుంటాడు. ఇంతలో అంకిత వస్తుంది. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అభి అంటుంది. ఎవరి గురించో ఆలోచించాల్సిన ఓపిక నాకు లేదు అంకిత. నేను నా గురించే ఆలోచిస్తున్నాను అంటాడు అభి. రెండు రోజుల్లో నగలు విడిపిస్తా అన్నావు కదా.. రెండు రోజుల్లో పండగ. ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతున్నావు అని అంటుంది అభి.

intinti gruhalakshmi 18 january full episode
దీంతో నగల విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది. అసలు నా పాలిట దురదృష్టం నువ్వే అనిపిస్తుంది. చూడు.. పండుగ లోపు ఆ నగలు విడిపించడం కుదిరేపని కాదు. ఏం చేస్తావో చేసుకో. నన్ను మాత్రం విసిగించకు అంటూ అభి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు అనసూయకు తీవ్రంగా తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి భరించడం నా వల్ల కాదు నాయనో అని అనుకుంటుంది అనసూయ. లాస్య చేయబట్టి నా తల బద్ధలు అయిపోతోంది అనుకుంటుంది అనసూయ. ఇంతలో తులసి వచ్చి.. ఏమైంది అత్తయ్య.. బామ్ రాయనా అని అంటుంది. ఆ మూల ఉన్న సుత్తి తెచ్చి నా తల పగులగొట్టు.. పీడ విరగడ అయిపోతుంది అంటుంది అనసూయ.
లాస్యకు నా వల్లే సమస్య.. అందుకే అలా చేస్తుంది అంటుంది తులసి. అది ఏమైనా చేసుకోని.. దాని పీడ నాకు ఎప్పుడు విరగడ అవుతుందో ఏమో అంటుంది అనసూయ. నేను లాస్య వేరు వేరు.. నేను లాస్యను కాలేను.. లాస్య తులసి కాలేదు అంటుంది తులసి. నా నుండి ఏం కోరుకుంటున్నారో తన నుంచి కూడా అదే జరగాలని కోరుకోకండి.. అది జరగని పని అని అనసూయతో చెబుతుంది తులసి.
మరోవైపు నందు రెడీ అవుతుంటాడు. పని మనిషి తులసి వల్ల వెళ్లిపోయిందని లాస్య బాధపడిపోతుంది. ఇంటి కోడలుగా నువ్వు పని మనిషి విషయంలో చేసిన పని తప్పు. నువ్వు చేయాల్సిన పనిని తులసి చేసింది. మా అమ్మను పనిమనిషి అన్ని మాటలు అంటుంటే నువ్వు ఏం చేశావు.. అంటూ నిలదీస్తాడు నందు.
తులసి ఫ్యాక్టరీకి వెళ్లేందుకు తయారు అవుతుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి నువ్వు ముందు వెళ్లాల్సింది ఫ్యాక్టరీకి కాదు.. ఆసుపత్రికి అంటాడు ప్రేమ్. చెకప్ చేయించుకోవాలి అని అంటాడు. ముందు నువ్వు పదా.. హాస్పిటల్ కు వెళ్లాకే ఇంకెక్కడికైనా వెళ్లొచ్చు పదా అంటాడు ప్రేమ్.
Intinti Gruhalakshmi 18 Jan Today Episode : నందు మొదటి రోజు కేఫ్ కు వెళ్తుండటంతో ఆల్ ది బెస్ట్ చెప్పిన తులసి
మరోవైపు నందు తన జాబ్ కు వెళ్లబోతుంటాడు. మీకంతా మంచే జరగాలి.. జరుగుతుంది. కొంచెం కోపం అదుపులో పెట్టుకోండి అని తులసి.. నందుకు సలహా ఇస్తుంది. అందరూ వచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతారు. దీంతో నందు చాలా సంతోషిస్తాడు.
ఇంతలో లాస్య వచ్చి సారీ నందు లంచ్ చేద్దామనుకున్నా కానీ కుదరలేదు. నువ్వు లంచ్ ఆన్ లైన్ లో బుక్ చేసుకో అంటుంది లాస్య. దీంతో నందు షాక్ అవుతాడు. ఆ తర్వాత పండుగకు అన్ని సామాన్లు తీసుకురండి అని శృతి, అంకిత.. తులసితో చెబుతారు. ఏం పండుగ అంటుంది లాస్య.
దీంతో ఈవిడకు పండుగ కూడా తెలియదా అని షాక్ అవుతారు అందరూ. ఆ తర్వాత కేఫ్ కు వెళ్తాడు నందు. రిలాక్స్ అవడానికి ఇన్ని రోజులు నేను కేఫ్ కు వెళ్లేవాడిని. కానీ.. ఇప్పుడు కేఫ్ నా జీవితం అయిపోయింది అని అనుకుంటాడు నందు. లోపలికి వెళ్తాడు.
మరోవైపు తులసి ఆసుపత్రికి రెగ్యులర్ చెకప్ కోసం వెళ్తుంది. తులసి రిపోర్టులు చూసి డాక్టర్.. ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్ లేదు కానీ.. ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం అంటుంది డాక్టరమ్మ. ఇంకోసారి క్యాన్సర్ వస్తే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు సర్జరీ చేసినా లాభం ఉండదు అని చెబుతుంది డాక్టర్.
దేవుడి నిర్ణయం ఇదే అయితే నేను చేయగలిగింది ఏముంటుంది అని అంటుంది తులసి. కానీ.. ఈ విషయం మాత్రం మా కుటుంబ సభ్యులకు తెలియనీయకండి అని డాక్టర్ ను కోరుతుంది తులసి. దీంతో ఆమె సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.