Intinti Gruhalakshmi 20 Oct Today Episode : జాను కోసం దివ్య.. విక్రమ్‌కు విడాకులు ఇవ్వబోతోందా? లాస్యను కొట్టిన తులసి.. కోపంతో అందరినీ చంపేందుకు ప్లాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 20 Oct Today Episode : జాను కోసం దివ్య.. విక్రమ్‌కు విడాకులు ఇవ్వబోతోందా? లాస్యను కొట్టిన తులసి.. కోపంతో అందరినీ చంపేందుకు ప్లాన్

Intinti Gruhalakshmi 20 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 20 అక్టోబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1080 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను చేతుల్లో పెట్టుకొని బాంబులు చిన్నప్పుడు కాల్చాను. ఈ కథలో నీతి ఏంటి అని అడుగుతుంది లాస్య. దీంతో నువ్వు చెప్పే మాటలు నమ్మకపోతే చేతుల్లోనే బాంబు పేలుతుంది అని అంటావా అంటే అవును.. అంటుంది తులసి. ఇంతలో కోరియర్ అబ్బాయి వస్తాయి. […]

 Authored By gatla | The Telugu News | Updated on :20 October 2023,9:00 am

Intinti Gruhalakshmi 20 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 20 అక్టోబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1080 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను చేతుల్లో పెట్టుకొని బాంబులు చిన్నప్పుడు కాల్చాను. ఈ కథలో నీతి ఏంటి అని అడుగుతుంది లాస్య. దీంతో నువ్వు చెప్పే మాటలు నమ్మకపోతే చేతుల్లోనే బాంబు పేలుతుంది అని అంటావా అంటే అవును.. అంటుంది తులసి. ఇంతలో కోరియర్ అబ్బాయి వస్తాయి. నందు వెళ్లి కోరియర్ తీసుకుంటాడు. ఇంతలో హనీ పిలవడంతో వెళ్లి హనీతో ఆ కోరియర్ బాక్స్ ను పట్టుకొని వెళ్తాడు. అంకుల్ ఏంటది అడుగుతుంది హనీ. దీంతో నా ఫ్రెండ్ కోసం బ్యూటిఫుల్ గిఫ్ట్ కొన్నాను అంటాడు నందు. దాన్ని తీసుకొని విప్పబోతుంది. ఆ కోరియర్ లో బాంబు ఉందేమో అనుకొని తులసి వెంటనే పరిగెత్తుకొస్తుంది. హనీ చేతుల్లో ఉన్న బాక్సును విసిరేస్తుంది. అది పేలుతుందా అని చూస్తుంటుంది.

పిచ్చి పట్టిందా.. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు నందు. అంకుల్ నాకోసం టెడ్డీ బేర్ తెప్పిస్తే ఎందుకు ఆంటి అలా విసిరేశారు. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అంటుంది హనీ. వద్దు హనీ.. దాన్ని ముట్టుకోకు అంటుంది తులసి. ఈ మధ్య ఇదే తంతు. వింతగా ప్రవర్తిస్తోంది. కారణం అడిగితే చెప్పదు అంటాడు నందు. మీరు మనసులో అనుమానం పెట్టుకుంటే నేనేం చేయలేను అని అంటుంది తులసి. ఎందుకు అలా బయట విసిరిపారేశావు అని అడుగుతుంది అనసూయ. అది కాదు అత్తయ్య.. బయట అంత గొడవగా ఉంది. ఇలా ఆన్ లైన్ లో తెప్పించే వాడితే వైరస్ లు వస్తున్నాయట. తెలిసి ఎందుకు రిస్క్ తీసుకోవడం. ఇలా ఇంకోసారి చేయకని చెప్పండి అంటుంది నందు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు హనీ వెళ్లి ఆ బొమ్మను తెచ్చుకుంటుంది. అందులో ఎలాంటి బాంబు ఉండదు.

intinti gruhalakshmi 20 october 2023 friday full episode

Intinti Gruhalakshmi 20 Oct Today Episode : తన మనసులో మాట బయటపెట్టిన జాను

అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని జానును అడుగుతాడు విక్రమ్. నీ మాటను గౌరవించాను కదా. పెళ్లి చూపుల్లో కూర్చొన్నాను కదా అంటుంది జాను. దీంతో కూర్చొనే పద్ధతి ఇదేనా అంటే.. ఫస్ట్ టైమ్ కదా అక్క. అందుకే అలా జరిగి ఉంటుంది అంటుంది జాను. దీంతో అందరి ముందే జానును నిలదీస్తుంది దివ్య. జానుతో నేను తర్వాత మాట్లాడుతాను అంటుంది రాజ్యలక్ష్మీ. ఇది మన ఫ్యామిలీ మ్యాటర్. అందరి మధ్యన తేలాలి. నువ్వేమంటావు అని అంటుంది దివ్య. దీంతో కరెక్ట్ అని అంటాడు విక్రమ్.

నీకు పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పేయాల్సింది. అనవసరంగా పెళ్లి చూపుల్లో అలా చేయకూడదు కదా అంటాడు విక్రమ్. తను కాదు అనలేదు. వచ్చిన వాళ్లు కాదు అనేలా వెకిలిగా ప్రవర్తించింది అంటుంది దివ్య. తను చేసిన తప్పు తెలుసుకుంది కాబట్టి కావాలని చేసింది కాబట్టి జాను నవ్వుతోంది. విక్రమ్ తో కావాలని క్లోజ్ గా మూవ్ అయింది. వాళ్లకి అనుమానం వచ్చేలా ప్రవర్తించింది. కాదంటావా విక్రమ్ అంటే.. కాదని ఎలా అంటాను అంటాడు విక్రమ్.

ఎందుకు ఇలా చేశావు అని అడిగే బాధ్యత మీకు లేదా? ఎందుకు అడగరు అంటుంది దివ్య. ఎవరు అడిగినా, అడగకపోయినా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. బావ అంటే నాకు ఇష్టం అంటుంది. కేవలం ఇష్టం మాత్రమే కాదు. ప్రేమ, చచ్చేంత ప్రేమ అంటుంది జాను. ఇక్కడి దాకా వచ్చాక ముసుగులో గుద్దులాట అనవసరం. ఇప్పటికే నేను ఇది బయటికి చెప్పకపోతే బావ ఇంకో సంబంధం తీసుకొస్తాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. నేను మౌనంగా ఉంటే పెద్దవాళ్లకు ఆశపెట్టినట్టే కదా అంటుంది జాను.

నా గురించి ఆలోచించుకున్న తర్వాతే ఎదుటి వాళ్ల గురించి ఆలోచిస్తాను అంటుంది జాను. మీ కూతురు ఇలా మాట్లాడుతుంటే మీరు బుద్ధి చెప్పరా అని జాను తల్లిదండ్రులను అడుగుతుంది. బావను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పా.. నువ్వు చేసుకున్నావు కదా. బావను తప్పితే ఇంకెవరినీ చేసుకోను. నా మనసులో మాట అందరికీ తెలిసిందా? రేపో మాపో జరిగేది ఇదే అంటుంది జాను.

మరోవైపు లాస్య ఇంటికి వెళ్లి మరీ లాస్య చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వు నా భర్తకు వల వేసినప్పుడు ఇలా చెంపదెబ్బ కొట్టి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చి ఉండేది కాదు అంటుంది తులసి. హనీని నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అప్పగిస్తావని అనుకున్నా. కానీ.. నీకు ఇంకా డోస్ సరిపోలేదు అని అంటుంది లాస్య. గొడవ పడటం ఇష్టం లేక నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. నీ ఆగడాలు భరిస్తున్నా అంటుంది తులసి.

దిక్కు తీచక, నీ వాళ్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నువ్వు సతమతమవుతున్నావు అంటుంది లాస్య. దీంతో ఒక్క పోలీస్ కంప్లయింట్ చాలు నీ జీవితం నాశనం అవుతుంది అంటుంది తులసి. నన్ను ఆపడానికి నువ్వు చేయగలిగింది ఒక్కటే. హనీని తిరిగి అప్పగించడం అని అంటుంది లాస్య.

దీంతో అది జరగదు అంటుంది తులసి. హనీ కోసం నీ వాళ్ల ప్రాణాలను కూడా బలి ఇస్తావా అంటుంది లాస్య. దీంతో డబ్బు తప్పితే బంధాలకు విలువ ఇవ్వని నీకు ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటుంది తులసి. ముసలివాళ్లకు ఏదైనా అయితే నందుకు సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వు అంటుంది లాస్య.

నీ మొండితనం ఇంట్లో వాళ్లకు నిన్ను శత్రువును చేస్తుంది. వాళ్లే నిన్ను బయటికి పంపిస్తారు. ఇప్పటి వరకు నేను చూపించింది ట్రెయిలర్ మాత్రమే. అసలు సినిమా చాలా ఉంది. దాన్ని నువ్వు తట్టుకోలేవు. ఈ లాస్యను తక్కువ అంచనా వేయకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హనీ విషయంలో సరైన నిర్ణయం తీసుకో. చాలు ఇక.. అని తులసిని పంపిస్తుంది లాస్య.

జాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. జాను ప్రవర్తనలో తేడా ఉందని. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు.. ఏమయిందో అంటుంది దివ్య. తప్పు చేశాను అంటాడు విక్రమ్. తను ఓపెన్ అయిపోయింది. నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అంటోంది అంటుంది దివ్య. దీంతో అదెలా కుదురుతుంది అంటాడు విక్రమ్.

జాను చాలా మొండిది దివ్య.. అందుకే పైకి ఏదైనా అనడానికి అందరూ వెనుకా ముందు ఆలోచిస్తూ ఉంటారు అంటాడు విక్రమ్. తను అడిగింది చేసేయడమేనా. వెళ్లు.. వెళ్లి జాను మెడలో మూడు ముళ్లు వేయి. లేకపోతే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుంది అంటుంది దివ్య.

జాను మనసులో ఏముందో తెలియకముందు తనను సపోర్ట్ చేశావు. తెలిశాక కూడా తననే సపోర్ట్ చేస్తున్నావు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటుంది దివ్య. జానును నేను సపోర్ట్ చేయడం లేదు. జాను మనసు ఎలా మార్చాలా? ఎలా నచ్చజెప్పాలా అని అలోచిస్తున్నాను అంటాడు విక్రమ్.

జాను ఆలోచనలు తప్పు కానీ జాను చెడ్డది కాదు. అర్ధాంతరంగా ఇంటి నుంచి పంపించకూడదు. అది సొల్యూషన్ కాదు అంటుంది దివ్య. మరి ఏం చేద్దాం. నేను జానును పట్టించుకోకుండా ఉంటాను. దూరంగా ఉంటాను. అప్పుడైనా తన తప్పు తెలిసి వస్తుందేమో, మనసు మార్చుకుంటుందేమో అంటాడు. దీంతో ఒకే ఇది బాగుంది కానీ.. తను ఊరికే ఉంటుందా? నిన్ను రెచ్చగొడుతుంది అంటుంది దివ్య.

నేను జాను కంటే మొండిగా ఉంటాను అంటాడు విక్రమ్. దీంతో సరే అంటుంది దివ్య. జాను నీకు అన్యాయం చేయాలనే ఆలోచనలో ఉంది. అయినా కూడా నువ్వు జాను మంచి కోరుకుంటున్నావు. పొరపాటున నేను తప్పు చేసినా నన్ను కూడా ఇలాగే చూసుకుంటావు కదా. దూరం చేసుకోవు కదా అంటాడు విక్రమ్. దీంతో నిన్ను దూరం చేసుకోవడం అంటే నన్ను నేను దూరం చేసుకోవడమే అంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది