Intinti Gruhalakshmi 22 Nov Today Episode : పరందామయ్య ఎక్కడికి వెళ్లాడు? డిప్రెషన్ లో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడా? తులసి పరిస్థితి ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 22 Nov Today Episode : పరందామయ్య ఎక్కడికి వెళ్లాడు? డిప్రెషన్ లో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడా? తులసి పరిస్థితి ఏంటి?

 Authored By gatla | The Telugu News | Updated on :22 November 2022,9:30 am

Intinti Gruhalakshmi 22 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 796 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య నిద్రలోనూ అనసూయ గురించే కలవరించి భయపడుతుండటంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. పాలు తాగమన్నా కూడా భయపడి పాలు మీద పడేసుకుంటాడు పరందామయ్య. దీంతో దుప్పటి మార్చి తెస్తా ఆగు అని చెప్పి బయటికి వెళ్తుంది తులసి. ఇంతలో చూస్తే పరందామయ్య కనిపించడు. దీంతో ఇళ్లంతా వెతుకుతుంది తులసి. కానీ.. పరందామయ్య కనిపించడు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. వెంటనే సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది. దీంతో సామ్రాట్ తన దగ్గరికి వస్తాడు. ఇద్దరూ కలిసి ఇంటి చుట్టుపక్కన వెతుకుతారు కానీ.. పరందామయ్య కనిపించడు. దీంతో తులసికి టెన్షన్ ఎక్కువవుతుంది.

intinti gruhalakshmi 22 november 2022 full episode

intinti gruhalakshmi 22 november 2022 full episode

ఇంతలో పరందామయ్య ఒక బిల్డింగ్ వద్ద కనిపిస్తాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గిరికి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది అని అడుగుతాడు. 10 వేలు వస్తాయి అని చెబుతాడు. దీంతో నాకు ఏదైనా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇప్పిస్తావా బాబు అని అడుగుతాడు. ఇవన్నీ విని తులసి, సామ్రాట్ షాక్ అవుతారు. మీకు ఎవరూ లేరా అని ఆ సెక్యూరిటీ గార్డ్ అడుగుతాడు. దీంతో నాకు బంగారం లాంటి కూతురు ఉంది కానీ.. తనకు నేను భారం కాకూడదని అనుకుంటున్నా. నా కూతురు బంగారం. నెత్తిన పెట్టుకొని చూసుకుంటోంది. ఇప్పటికే తను సమస్యల్లో ఉంది. నేను కొత్త సమస్యగా మారదల్చుకోలేదు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటాను.. అంటాడు పరందామయ్య. ఆ తర్వాత నీ వెనుక పెద్ద కథే ఉన్నట్టుంది. భార్య లేదా అంటాడు. దీంతో చచ్చిపోయింది అని చెబుతాడు పరందామయ్య.

అయ్యో పాపం అంటాడు. నీకు ఉద్యోగం చూసి పెడతాలే పెద్దాయన అంటాడు. దీంతో తప్పకుండా చూడు. సంపాదన లేనివాడిని కానీ.. చేతకాని వాడిని కాదు అంటాడు. కష్టపడి పనిచేస్తా. రాత్రంతా మెలుకువగా ఉండి పని చేస్తా అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చి మామయ్య ఏంటి ఇది.. నన్ను కూడా చంపేశారా.. లేననుకున్నారా? ఏంటి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంది తులసి.

నాకు అడ్డు పడకు అమ్మ అంటాడు పరందామయ్య. దీంతో రాత్రి అయింది. మనం వెళ్దాం పదండి. ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత తనను ఇంటికి తీసుకెళ్తారు. మరోవైపు ఉదయమే దేవుడికి పూజ చేస్తుంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi 22 Nov Today Episode : మేము కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెప్పిన ప్రేమ్, శృతి

అనసూయను చూసి అభి, అంకిత షాక్ అవుతారు. అందరూ కిందికి దిగుతారు. రాత్రి రాక్షసిలా అరిసింది. ఇప్పుడేంటి ఇంత కూల్ అయింది అని అనుకుంటుంది లాస్య. హారతి తీసుకోండి అంటుంది. దీంతో అందరూ హారతి తీసుకుంటారు. గుడ్ మార్నింగ్ లాస్య అంటుంది. దీంతో నిజంగా ఇది గుడ్ మార్నింగ్ కావాలంటే వెంటనే వెళ్లి మామయ్య తీసుకురావాలి అంటుంది లాస్య.

దీంతో వస్తారు.. ఆయనకు ఆయనే వస్తారు. ముందు హారతి తీసుకో అంటుంది అనసూయ. నిన్న నేను అరిచాను కదా అందుకే ఆయనకు కోపం వచ్చి ఉంటుంది. తెల్లారే సరికి ఆ కోపం తగ్గుతుందిలే. ఆయనే తిరిగి వస్తారులే అంటుంది అనసూయ.

మీకు మీరు సర్దిచెప్పుకుంటున్నారా? లేక మాకు సర్దిచెబుతున్నారా? అమ్మమ్మ అని అడుగుతుంది అంకిత. దీంతో నేను ఎవ్వరికీ సర్దిచెప్పడం లేదు. మా 50 ఏళ్ల కాపురంలో ఇవన్నీ మాకు అలవాటే. ఎప్పుడూ ఎవరు తగ్గాలో మాకు తెలుసు అంటుంది అనసూయ.

ఆయన అంతట ఆయన తిరిగి వస్తారు. వేరే దారి లేదు అంటుంది అనసూయ. ఒకవేళ రాకపోతే అంటుంది లాస్య. నా మొగుడిని నా నుంచి ఎవరూ లాక్కోలేరు అంటుంది అనసూయ. దీంతో ఎవరైనా లాక్కుంటే అంటుంది లాస్య. దీంతో నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అంటుంది అనసూయ.

మరోవైపు తులసి కాఫీ ఇచ్చినా నాకు తాగాలని లేదు అంటాడు పరందామయ్య. అవునా.. అలా అయితే ఇలా ఇచ్చేయ్ అమ్మా.. నేనే తాగేస్తాను అని సామ్రాట్ బాబాయి తాగేస్తాడు. తొందరలో కాఫీ మీద పోసుకుంటాడు. పరందామయ్య గారు ఈరోజు నుంచి మనమందరం కలిసి వాకింగ్ కు వెళ్తున్నాం అంటాడు సామ్రాట్.

అయినా కూడా ఏం మాట్లాడడు పరందామయ్య. తర్వాత ఆయనను లేపి తీసుకెళ్తారు. మరోవైపు ప్రేమ్, శృతి ఇద్దరూ బ్యాగులు సర్దుకొని బయలుదేరుతారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనసూయ. దీంతో ఎక్కడ ప్రేమ ఉందో అక్కడికే వెళ్తున్నాం అంటాడు ప్రేమ్.

ఇంతలో అక్కడికి వచ్చిన లాస్య.. ఈ డొంకతిరుగుడు ఎందుకు.. మీ అమ్మ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పొచ్చు కదా అంటుంది లాస్య. అరె.. నేను చెప్పా కదా.. ఎలా పసిగట్టిందో చూడు అంటాడు ప్రేమ్. పెద్దరికంతో అందరికీ నచ్చజెప్పి అందరూ కలిసి ఉండేలా చేయాల్సిన నానమ్మే ఆవేశపడుతోంది అంటాడు ప్రేమ్.

ఇవాళ తాతయ్యనే అవమానించావు. రేపు మమ్మల్ని కూడా అలా చేయవని ఏంటి నమ్మకం అంటాడు ప్రేమ్. అందుకే మేము వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాం అంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది