Jabardasth Naresh : కాలు జారి పడిపోయిన నరేష్.. ప్రమాదంపై అసలు కథ ఏంటంటే?
Naresh: బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఈ షోతో ఎంతో మంది కమెడీయన్స్ వెలుగులోకి వచ్చారు. జబర్ధస్త్ షో చాలా మందిని ఆర్టిస్ట్ లుగా మార్చి మంచి హోదాలో ఉండేలా చేసింది. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునేలా కూడా చేసింది. ఇందులో పొట్టి నరేష్ ఒకరు. తన కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన ప్రతి షో సూపర్ హిట్. తనదైన పంచ్‌లతో తెగ నవ్వు తెప్పించే నరేష్ కడుపుబ్బ నవ్విస్తుంటాడు.
నరేష్ రీసెంట్‌గా క్యాష్ ప్రోగ్రాంకి వచ్చాడు. అక్కడ ఆయన చేసిన సందడి మాములుగా లేదు. సుమపై కూడా పంచ్‌లు వేశాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్‌ని అయితే ఓ ఆట ఆడుకున్నాడు. సుమని లవ్ చేస్తారా అని అడిగాడు నరేష్. పోరా జఫ్పా అని ఆమె అంటుంది. అయితే మీరు చేయకపోతే ఇక్కడ నుండి దూకుతా అని బెదిరిస్తూనే కాలు జారి పడిపోయాడు. దీంతో అందరు ఉలిక్కిపడ్డారు. నరేష్‌కి ఏమైందనో అని తెగ టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుండగా, ఇది నెటిజన్స్‌ని అలరిస్తుంది.చూడటానికి మూడు అడుగులు ఉండే పొట్టి నరేష్ తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Jabardasth Naresh : నరేష్ అలా భయపెట్టాడేంటి..!
కెరీర్ మొదట్లో ఢీ జూనియర్స్ లో పాల్గొనగా.. ఆ తర్వాత సునామి సుధాకర్ జబర్దస్త్ లో అవకాశం వచ్చేలా చేశాడు. అలా కొన్నాళ్ళు చంటి టీమ్ లో చేయగా.. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేరి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. కొన్ని కొన్ని సార్లు లేడీ గెటప్ లో కూడా వచ్చి బాగా రచ్చరచ్చ చేస్తుంటాడు. ఇక నరేష్ వయసు 20 ఏళ్లు అని గతంలో తెలిసింది. ఇది వరకే ఈయనకు పెళ్లి అయిందని ఆమె పేరు త్రిపురాంబిక అని పేరు కూడా ప్రచారం జరుగగా.. ఆమె నరేష్ భార్య కాదని మరో పొట్టి నటుడు రమేష్ భార్య అని తెలిసింది.