Meera Jasamine : దుపట్టా అడ్డు లేకపోతే మీరా జాస్మిన్ అభిమానులకి పండగే..!
Meera Jasamine : మీరా జాస్మిన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమె అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగుసినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా తో పర్వాలేదనిపించినా భద్ర సినిమాతో మాత్రం బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకుంది. 2004లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2010 వరకు కూడా గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు అందుకున్న మీరాజాస్మిన్ పెళ్లి చేసుకుని సినిమాల నుంచి తప్పుకుంది.
ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ మెయిన్ లీడ్ గా అయితే మళ్లీ కనిపించలేదు. వెండితెరపై క్యూట్ హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసిన మీరా హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలకు సిద్ధంగానే ఉన్నట్లు సందేశం పంపుతుంది. అయితే అది ఇక కష్టమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ దుపట్టా అడ్డుపెట్టుకొని తన అందాలతో రచ్చలేపింది. బ్యూటీ పిక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రియమణి మాదిరి సీనియర్ స్టార్ హీరోలైన నాగ్, వెంకీ, బాలయ్య పక్కన వయసుకు దగ్గ పాత్రలు చేసే అవకాశం మీరాకి ఉంది.
Meera Jasamine : మీరా అందాలు అదరహో..
అలాంటి పాత్రలు దక్కినా ఆమెకు బ్రేక్ వచ్చినట్లే. అయితే మీరా జాస్మిన్ ని జనాలు మర్చిపోయారు. పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆమెను చాలా అభిమానించేవారు. మంచి నటిగా మీరా ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు.ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది.