Hyper Aadi : హైపర్ ఆదినే కోరుకుంటోన్న జనం.. జబర్దస్త్ షోలో అసలు ఏమైంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : హైపర్ ఆదినే కోరుకుంటోన్న జనం.. జబర్దస్త్ షోలో అసలు ఏమైంది?

 Authored By prabhas | The Telugu News | Updated on :24 April 2022,1:30 pm

Hyper Aadi : హైపర్ ఆది గత కొన్ని వారాలుగా జబర్దస్త్ షోకి రావడం లేదు. పూర్తిగా మానేశాడా? లేదంటే ఏదైనా పనుల వల్ల రాలేకపోతోన్నాడా? అనేది తెలియడం లేదు. కానీ జనాలు మాత్రం హైపర్ ఆది కోసం వెయిట్ చేస్తున్నారు. ఆది లేని షోను మేం చూడలేం.. ఆది రావాలి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు జరిగిన మ్యాటర్ ఏంటో మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.ఆది స్కిట్ లేని ఎపిసోడ్ ఎంత చప్పగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

అయితే ఆది మాత్రం ఢీ షోలో కనిపిస్తున్నాడు. మరో వైపు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కనిపిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మాత్రం కనిపించడం లేదు. మల్లెమాలతో గొడవలు అయి ఉంటే.. మిగతా షోల్లోనూ కనిపించకుండా పోయేవాడు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడో షూట్ చేసిన ఎపిసోడ్‌లు.ఆ టైంలో హైపర్ ఆది బిజీగా ఉండి షూటింగ్‌కు రాలేకపోయి ఉంటాడేమోనని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఆది లేని లోటు మాత్రం జబర్దస్త్ షోలో స్పష్టంగా కనిపిస్తోంది.

netizens wants to back hyper aadi in jabardasth show

netizens wants to back hyper aadi in jabardasth show

ఆది లేకపోవడంతో టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోతోంది. మరి ఆది ఎప్పుడు తిరిగి వస్తాడో చూడాలి. అసలు వస్తాడా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలేట్టుంది.మరో వైపు హైపర్ ఆదికి వెండితెరపై ఫుల్ ఆఫర్లు వస్తుంటాయి. రైటర్‌గా, నటుడిగా హైపర్ ఆదికి మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోలో రాఘవ స్కిట్లు మాత్రం క్లీన్ సర్టిఫికేట్‌తో మంచి పేరును తెచ్చుకుంటున్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది