Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంతో డాన్స్ లు వేసే బ్రేకింగ్ న్యూస్ !

Advertisement

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ అన్ని భారీ బడ్జెట్ సినిమాలలోనే నటిస్తున్నాడు. త్వరలోనే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ విడుదల అయింది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో ఎవరు చేయలేని విధంగా వరుస పెట్టి భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే మరిన్ని కథలను కూడా వింటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు అతడిని బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండమని కూడా చెప్పాడు.

Prabhas new movie update
Prabhas new movie update

దీంతో ఇప్పుడు ఆదర్శకుడు ఆ పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మొదలుపెట్టి అవకాశాలు ఉన్నాయని తెలిసింది. రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవకుడి ప్రాజెక్టును సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాని ఒకేసారి చేయబోతున్నాడట. ఈ రెండు సినిమాలు షూటింగ్లలో ఒకేసారి పాల్గొబోతున్నాడు అని తెలిసింది. తద్వారా ఈ క్రేజీ ప్రాజెక్టులను ఒకేసారి పూర్తిచేసేలా ప్లాన్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు.

Advertisement

Prabhas HD Wallpapers | Latest Prabhas Wallpapers HD Free Download (1080p  to 2K) - FilmiBeat

అయితే ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ప్యూర్ లవ్ స్టోరీ తో రాబోతుందని సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రకటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కామెడీ హర్రర్ సినిమాగా తెరకెక్కుతుంది. తొలిసారిగా ప్రభాస్ హర్రర్ సినిమా జోనర్ లో ట్రై చేస్తున్నాడు. మరీ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.

Advertisement
Advertisement