Priya Prakash Varrier : నెలవంక బొట్టు, ముక్కెర పెట్టుకుని చూపులతోనే మత్తెక్కిస్తున్న ప్రియా ప్రకాశ్..!
Priya Prakash Varrier : కన్నుగీటుతోనే బాగా పాపులర్ అయిన వింకిల్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్.. సోషల్ మీడియా సెన్సేషనల్ స్టార్ అని చెప్పొచ్చు. ఈ భామ ‘ఓరు ఆధార్ లవ్’ అనే ఫిల్మ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయింది.
యూత్ స్టార్ నితిన్ హీరోగా వచ్చిన ‘చెక్’సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియ..ఆ తర్వాత తేజ హీరోగా వచ్చిన ‘ఇష్క్..నాట్ ఏ లవ్ స్టోరి’ ఫిల్మ్‌లోనూ కథానాయికగా కనిపించింది. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
Priya Prakash Varrier : సంప్రదాయ వస్త్రాల్లో కుందనపు బొమ్మలా ప్రియా ప్రకాశ్ వారియర్..
ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియా ప్రకాశ్ వారియర్.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సదరు ఫొటోలో ప్రియా చాలా అందంగా కనబడుతోంది. నెలవంక బొట్టు, ముక్కుకు ముక్కర పెట్టుకుని, జడలో గులాబీ పూలు పెట్టుకుని కుందనపు బొమ్మలా కనబడుతోంది ప్రియ. బ్లాక్ అంద్ పింక్ కలర్ శారీలో ప్రియ.. మెడలో తగు ఆభరణం ధరించి చూపులతోనే మత్తెక్కిస్తోంది.
ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనదం వ్యక్తం చేస్తున్నారు. ‘సో ప్రెట్టీ, గార్జియస్, బ్యూటిఫుల్’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రజెంట్.. ‘శ్రీదేవి బంగ్లా, విష్ణుప్రియ’ అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘శ్రీదేవి బంగ్లా’ హిందీ ఫిల్మ్ కాగా, ‘విష్ణుప్రియ’ కన్నడ భాష చిత్రం. మొత్తంగా ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్‌ను టచ్ చేస్తోంది.