Aadipurush Movie : ప్రభాస్ ఆదిపురుష్ ని తమిళ సినిమా ప్రజలు కావాలనే తక్కువ చేస్తున్నారు , కారణం ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aadipurush Movie : ప్రభాస్ ఆదిపురుష్ ని తమిళ సినిమా ప్రజలు కావాలనే తక్కువ చేస్తున్నారు , కారణం ఇదే !

 Authored By aruna | The Telugu News | Updated on :17 June 2023,1:07 pm

Aadipurush Movie  : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా రామాయణం కథ కాబట్టి ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు.

దేశమంతటా ఆదిపురుష్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే వీటికి మంచి స్పందన వచ్చింది. ఆదిపురుష్ సినిమాలు బుక్ చేసేందుకు బుక్ మై షో పేటీఎం యాప్స్ వంటివి ఉంటాయి. అయితే అవి స్ట్రక్ అయ్యే లెవెల్లో జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి క్రేజ్ ఏర్పడినప్పటికీ ఒక్క తమిళనాడులో మాత్రం సిచువేషన్ వేరేలా కనిపిస్తుంది.

Tamil audience not intrest to Aadipurush movie

Tamil audience not intrest to Aadipurush movie

తమిళ ప్రేక్షకులు ఈ సినిమా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. తమిళంలో ఈ వారం సరైన సినిమాలు లేవు. అయినా ఆది పురుష్ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ లేవు. అందులోను ఎవరు బుకింగ్స్ చేసుకోవడం లేదు. హిందీ తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్ లు కనిపిస్తున్నాయి. అయితే తమిళ వెర్షన్ షోలన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి నెలకొంది. తమిళ ప్రేక్షకులు ఆదిపురుష్ సినిమాను తక్కువగా చూస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది