Rashmika mandanna : న్యూ ఇయర్ రోజున డేటింగ్‌కు వెళ్లిన రష్మిక మందన్నా.. ఇదే సాక్ష్యం, కాదనగలరా..?
Rashmika mandanna : విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగి పోయింది. అయితే ఏ నటుడు అయినా ఒక్క సినిమా తో స్టార్ అవ్వలేదు. ఒక సినిమా ఎంత పెద్ద విజయం సాధించినా కూడా తదుపరి సినిమా కూడా విజయం సాధిస్తేనే అతడి స్టార్ డమ్ సుస్థిర స్థానం సంపాదించుకున్నట్లు అవుతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో స్టార్ అవ్వగా గీత గోవిందం సినిమా ఆ స్టార్ డమ్ ను మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు.
గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడీగా రష్మిక మందన్నా నటించింది. వీరిద్దరి కాంబోకు సూపర్ హిట్ జోడీగా పేరు వచ్చింది. అందుకే గీత గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా లో నటించారు. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా వీరి జోడీకి మంచి పేరు మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చింది. వీరిద్దరు కలిసి నటించిన సినిమా లు రెండు.. కలిసి నటించి అయిదు ఏళ్లు అవుతుంది. అయినా కూడా వీరి మద్య స్నేహం కొనసాగుతుంది. వీరిది స్నేహం అనే కంటే మరో పేరు పెట్టాలేమో అనిపిస్తుంది. ఈమద్య కాలంలో వీరిద్దరు ముంబయిలో పార్టీ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి ముంబయి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

Vijay devarakonda and Rashmika mandanna in love this is the proof
Rashmika mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్
ఆ తర్వాత రష్మిక మందన్నా ఒక సినిమా తో సక్సెస్ దక్కించుకోవడంతో ఆమెకు విజయ్ దేవరకొండ స్పెషల్ పార్టీ ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆనంద్ దేవరకొండ సినిమా ప్రారంభోత్సవానికి.. ఆయన సినిమా ప్రీవ్యూలకు కూడా రష్మిక మందన్న హాజరు అవ్వడం.. విజయ్ దేవరకొండతో క్లోజ్ గా ఉండటం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వీరి వేడుకలు ఆ విషయాన్ని మరింతగా రుజువు చేస్తున్నాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనేందుకు ఒక ఫొటో కూడా సాక్ష్యంగా నిలిచింది. కొత్త సంవత్సరం పార్టీని రష్మిక మరియు విజయ్ లు గోవాలో చేసుకున్నారు.
కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఆనంద్ దేవరకొండ మరియు రష్మిక మందన్నాలు షేర్ చేసిన ఫొటోలు లొకేషన్ సేమ్ గా ఉన్నాయి. అంటే ఇద్దరు కూడా ఒకే చోట ఉన్నారు ఆ రోజు. విజయ్ దేవరకొండ కూడా అక్కడే ఉన్నట్లుగా ఆనంద్ దేవరకొండ ఫొటో చూస్తుంటే అర్థం అవుతుంది. అంటే న్యూ ఇయర్ నైట్ ను రష్మిక మరియు విజయ్ దేవరకొండ కలిసి ఉన్నారు. ఇంతకంటే వీరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అనేందుకు సాక్ష్యం అక్కర్లేదు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఇంట ఏ ప్రత్యేక సందర్బం ఉన్నా కూడా రష్మిక అక్కడ ఉంటుంది. స్నేహితులం అని ఇద్దరు కూడా ఎక్కువ చెప్పడం లేదు. కనుక వీరిద్దరి మద్య ప్రేమ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రష్మిక మందన్నా కన్నడ నటుడితో పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు రౌడీ స్టార్ తో పెళ్లికి సిద్దం అయ్యేనేమో చూడాలి.