Chandrayaan 3 : చంద్రయాన్ 1, 2 అండ్ 3 పూర్తి కథ.. చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది? చంద్రయాన్ 3 వల్ల ఏంటి ఉపయోగం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrayaan 3 : చంద్రయాన్ 1, 2 అండ్ 3 పూర్తి కథ.. చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది? చంద్రయాన్ 3 వల్ల ఏంటి ఉపయోగం..?

 Authored By gatla | The Telugu News | Updated on :27 August 2023,3:00 pm

Chandrayaan 3 : ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్నారు. అసలు చంద్రయాన్ 3 ని చంద్రుడి మీదికి ఎందుకు పంపించారు. చంద్రయాన్ 1, చంద్రాయన్ 2 ప్రాజెక్టులు ఏమయ్యాయి. చంద్రయాన్ 3 అని ఈ ప్రాజెక్ట్ కి ఎందుకు పేరు పెట్టారు. అసలు.. చంద్రుడి మీద ఏం రీసెర్చ్ చేయబోతున్నారు. చంద్రుడి మీద ఏముంది.. అనేది చాలామందికి తెలియదు. ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం రండి.చంద్రుడి మీద రీసెర్చ్ చేయడానికి రష్యా, అమెరికా, చైనాతో పాటు భారత్ కూడా తన పయనం మొదలు పెట్టింది. ఇస్రో తొలిసారిగా 2008 లో చంద్రయాన్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. 2008 లో చంద్రుడి మీదికి ఇస్రో ఒక ఆర్బిటార్ ను పంపింది. ఆ ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ 10 నెలల పాటు 3400 సార్లు తిరిగి చంద్రుడికి సంబంధించిన పలు విషయాలను భారత్ కు చేరవేసింది.

చాలా ఫోటోలను పంపించింది. చంద్రయాన్ వన్ ద్వారానే చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని తొలిసారిగా భారత్ ఆధారాలతో సహా నిరూపించింది. అప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుడి మీద నీరు ఉన్న ఆనవాళ్లను చూపించలేకపోయాయి. 2008 లోనే ఇండియా చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని నిరూపించింది.చంద్రుడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడం కోసమే చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది ఇస్రో. చంద్రుడి మీదికి ఒక రోవర్ ను పంపించాలని అనుకుంది ఇస్రో. చంద్రుడి దక్షిణ దృవం ప్రాంతంలో ఆ రోవర్ ను దింపాలనేది ఇస్రో ప్లాన్. కానీ.. చివరి నిమిషంలో రోవర్.. చంద్రుడి మీదికి దిగే సమయంలో.. ఆ రోవర్ కి, ఇస్రోకి మధ్య ఉన్న కనెక్షన్ పోయింది. దీంతో ఆ రోవర్ చంద్రుడి మీద కుప్పకూలిపోయింది.

how chandrayaan 3 mission became successful

how chandrayaan 3 mission became successful

Chandrayaan 3 : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ని ఎందుకు స్టార్ట్ చేశారు?

చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది 2019లో. చిన్న తప్పిదం వల్ల చంద్రయాన్ 2 ఫెయిల్ అవడంతో ఎలాగైనా ఈ మిషన్ ఆగకూడదని మరోసారి ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసింది ఇస్రో. ఆ ప్రాజెక్ట్ కే చంద్రయాన్ 3 అనే పేరు పెట్టి దాదాపు నాలుగేళ్లు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కోసం ఇస్రో నిరంతరం శ్రమించింది. చంద్రయాన్ 2 లాండింగ్ టైమ్ లో చేసిన తప్పిదం మళ్లీ రాకుండా, చంద్రయాన్ 3 లో ఉన్న రెండు ఇంజన్లు ఫెయిల్ అయినా కూడా ఆ పరిస్థితిని తట్టుకొని ఎలాగైనా సాఫ్ట్ లాండింగ్ జరిగేలా చంద్రయాన్ 3 ని రెడీ చేశారు.ఇన్ని కష్టాలు పడి వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చంద్రుడి మీదికి రాకెట్ ను పంపించాలి. అక్కడ ఏముంది. ఏం తెలుసుకోవాలి. అసలు ఇస్రో అక్కడ ఏం తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది అనేది చాలామందికి తెలియదు. కానీ.. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వనరులు. మన దేశంలో అయితే వనరుల కొరత భారీగా ఉంది. దానికి కారణం మన దేశంలో ఉన్న జనాభా. ప్రపంచంలోనే మనం జనాభాలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం.

చైనాను కూడా దాటేసి 150 కోట్ల మంది ప్రజలతో మొదటి ప్లేస్ లో ఉన్నాం. మనది విస్తీర్ణం పరంగా చూసుకుంటే చాలా చిన్న దేశం. వనరులు కూడా లేవు. భవిష్యత్తు తరాలు అయితే వనరులు లేకుండా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చంద్రుడి మీద ఏవైనా వనరులు ఉంటే వాటిని మనం సొంతం చేసుకోగలిగితే భవిష్యత్తు తరాలను కాపాడుకున్న వాళ్లం అవుతాం.అందుకే చంద్రుడి మీద ఆన్వేషణ కోసం ఇస్రో చివరకు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. నిజానికి చంద్రుడు మనకు సగభాగం మాత్రమే కనిపిస్తాడు. పూర్తిగా కనిపించడు. సగభాగం భూమికి వెనుకవైపు ఉంటుంది. అది మనకు కనిపించదు. దాన్నే దక్షిణ దృవం అంటారు. ఆ దక్షిణ దృవం వైపు వెళ్లగలిగితే అక్కడ ఏం ఉన్నాయో తెలుసుకోగలిగితే మనం సక్సెస్ అయినట్టే అని భావించిన ఇస్రో.. అటువైపుగా చంద్రయాన్ 2 నుంచే పరిశోధనలు ప్రారంభించింది.

చివరకు చంద్రయాన్ 3 ద్వారా దక్షిణ దృవంలో విక్రమ్ లాండర్ ను లాంచ్ చేసి ప్రపంచంలోనే చంద్రుడి దక్షిణ దృవం వద్ద అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే.. చంద్రుడి మీద ఎక్కువగా హీలియం గ్యాస్ ఉన్నట్టుగా తేలింది. హీలియం గ్యాస్ మొత్తాన్ని మనం భూమి మీదికి తీసుకురాగలిగితే అది ఒక వండర్ అనే చెప్పుకోవచ్చు. మన భూమి మీద తక్కువగా ఉండే ఈ హీలియం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మన భారత్ లో పవర్ ను తయారు చేయడానికి ఎక్కువగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ను వినియోగిస్తున్నాం. దీని ద్వారా పవర్ ను జనరేట్ చేయడానికి న్యూక్లియర్ ఫ్యుజన్ అనే ప్రాసెస్ ను చేస్తారు. దాని వల్ల చాలా రేడియేషన్ గాలిలో కలుస్తుంది. అది చాలా డేంజర్. కానీ.. న్యూక్లియర్ ఫ్యుజన్ ప్రాసెస్ కోసం హీలియంని వాడితే రేడియేషన్ ఉత్పత్తి కాదు. ఆ హీలియం చంద్రుడి మీద ఎక్కువగా ఉంది కాబట్టే ఆ దిశగా పరిశోధనలు చేసేందుకే ఇస్రో శ్రమిస్తోంది. అందులో భాగంగానే చంద్రయాన్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. చూద్దాం మరి ఇస్రో.. చంద్రుడి మీద ఉన్న హీలియం మొత్తాన్ని భూమి మీదికి తేగలుగుతుందా? ఇంకా అక్కడ ఏ వనరులు ఉన్నాయో తెలుసుకోగలుగుతుందా? చూద్దాం.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది