Hair Tips : ఈ జెల్ ను జుట్టుకు రాశారంటే చాలు.. గడ్డి కంటే ఫాస్ట్ గా మీ జుట్టు పెరుగడం ఖాయం!
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలా మందికి జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ల వరకు జుట్టు రాలే సమస్యతో బాధపడేవాళ్లే. అయితే వీటికోసం వేల రూపాయలను ఖర్చు చేస్తూ.. హెయిర్ షాంపూలు, డైలు, స్ప్రేలు, నూనెలు వంటివి రాస్తుంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా సమస్యను మరింతగా పెంచుకుంటారు. అయితే ఇలాంటి వాటన్నిటికి ముఖ్య కారమఁ పోషకాహార లోపమేనని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనం బయట ఆహారానికి అలావాటు పడి అన్ని పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం లేదని అంటున్నారు. పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఉన్ని పోషకాలు ఉండేట్లు చూసుకోవాలి.
అలాగే జుట్టును లోపలి నుంచి బలంగా చేయాలి, పెంచుకోవాలంటే ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ అద్భుతమైన జెల్ ని తయారు చేసుకోండి. దీని వల్ల జుట్టు గడ్డిలా పెరుగుతుంది. అయితే ఈ జెల్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనకు ముందుగా కావాల్సింది అలోవెరా జెల్. మనకు చాలా రకాల అలోవెరా జెల్ లు మార్కెట్ లో లభ్యం అవుతుంటాయి. అందులో నాచురల్ అలోవెరా జెల్ ను మనం ఉపయోగించాలి. ఇది పారదర్శకంగా ఉంటుంది. రెండోది గ్రీన్ టీ డికాక్షన్. మనకు మార్కెట్ లో లభించే ఏదైనా గ్రీన్ టీని ఉపయోగించవచ్చు. మూడోది విటామిన్ క్యాప్సుల్స్. ఇప్పుడు ఒక బౌల్ తీస్కొని అందులో మన జుట్టుకు సరిపడినంత అలోవెరా జెల్ ను వేసుకోవాలి.
అందులో గ్రీన్ టీ డికాక్షన్ వేస్కొని కలుపుకోవాలి. అందులో రెండు విటామిన్ ఇ క్యాప్సుల్స్ లోని ఆయిల్ వేస్కొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన క్రీంను మన తలకు పాయలు పాయలుగా తీస్కొని కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గంట సమయం అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మంచి షాంపూతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా మన హెయిర్ కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఈ రెమిడీని ఒక హెయిర్ స్పెషలిస్ట్ రికమెండ్ చేశారు. దీని వల్ల మంచి ఫలితం వస్తుంది. కచ్చితంగా మీరూ దీన్ని పాటించండి. అలాగే పోషకాలు కల్గిన ఆహారం తీస్కోవడం కూడా చాలా ముఖ్యం.