Clove Tea : లవంగం టీతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు… మరి దీన్ని తయారు చేయడం ఎలా.?
Clove Tea : చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు ఒళ్ళు నొప్పులు ఇంకా ఎన్నో రకాల వ్యాధులు చుట్టూముడుతు ఉంటాయి. అయితే ఈ సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలంటే వంటింట్లో కనిపించి ప్రతిదీ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు గా చెప్పుకునే మన మసాలా దినుసులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అటువంటి మసాలా దినుసులు లవంగం కూడా ఒక ప్రధానమైనది. దీనికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. లవంగం ప్రతి ఇంట్లో కనిపించే రుచికరమైన మసాలా దినుసు. దీనిని అన్ని కూరలలో బిర్యానిలలో వాడుతూ ఉంటారు. వాటి రుచిని అధికం చేయడానికి లవంగాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. లవంగాలలో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి.
దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.
మీరు శీతాకాలంలో లవంగం టీ ని తప్పకుండా అలవాటు చేసుకుంటే చలికాలం వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. ఈ లవంగం టీ ని తయారు చేయడానికి పాలని వాడవలసిన అవసరం ఉండదు. లవంగం టీ ఉపయోగాలు దానిని ఎలా తయారు చేయాలో మనం చూద్దాం.. లవంగం టీ తయారు చేయడానికి లవంగాలు బాగా దంచి ఒక కప్పు నీటిలో కలుపుకోవాలి. తర్వాత ఆ కప్పు నీటిని గ్యాస్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత దీని వడకట్టి దానిలో కొంచెం తేనె కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని తీసుకోవాలి. ఈ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం..
Clove Tea : ఈ లవంగం టి తయారు చేసే విధానం
అయితే లవంగం దానిని వేడి ప్రభావం వల్ల కూడా హాని కలిగిస్తూ ఉంటుంది. కావున దీనిని అధికంగా తీసుకోవద్దు.. లవంగం టీ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే అన్ని చర్మ సంబంధిత ఇబ్బందులను తగ్గిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేస్తుంది.. అలాగే ఇమ్యూనిటీని పటిష్టం చేయడానికి ఈ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లవంగం తీసుకోవడం వలన శరీరంలో విష పదార్థాలు అన్ని తొలగిపోతాయి. అలాగే బ్లడ్ సర్కులేషన్స్ బాగా జరుగుతుంది. అలాగే లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కావున ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది.
లవంగం శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా జీర్ణ క్రియాని క్రమభర్తీకిస్తుంది. కావున శరీరానికి కావలసింది శక్తి వెంటనే అందుతుంది. లవంగాలలో ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలంటే లవంగం టీ మీకు చాలా బాగా సహాయపడుతుంది. దంతాల నొప్పి చిగుళ్లలో వాపు ఉంటే లవంగం తీసుకోవడం చాలా మంచిది. దాని వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. లవంగం టీ నోటిలోని బ్యాటరీ అని కూడా చంపేస్తుంది. లవంగాలు రుచి ఘాటుగా ఉన్నప్పటికీ చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే తీసుకోవడం వల్ల మంట, దగ్గు, జలుబులు, గొంతు నొప్పి ఇలాంటి ఎన్నో రకాల సీజనల్ నుంచి బయట పడేస్తుంది..