Diabetes : కొర్ర అన్నం.. డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్.. ఒకసారి మీరు ట్రైచేయండి..!
Diabetes : సిరి ధాన్యాలు అంటే చిరు ధాన్యాలు కావు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యం.. ముఖ్యంగా కొర్రలను సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. ఈ ఆధునిక జీవితంలో మంచి ఆరోగ్యాన్ని అందించే కొర్రలను చాలా మంది ఆహారంలో బాగంగా చేసుకుంటున్నారు. ఒకప్పుడు.. వరి అన్నం తినడానికి స్తోమత లేని వారు కొర్ర అన్నం, ఊదల అన్నం తినేవారు. అలాంటిది వాటి విలువ తెలిసి ఇప్పుడు అందరూ చిరుధాన్యాల వైపే వెళ్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు చిరు ధాన్యాలు సేవించడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. కొర్రలకు డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే శక్తి ఉండటం వలన కొర్రలను వాడటం ఎక్కువైంది.
కొర్రలలో పీచు సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి డయబెటిస్, అధిక బరువు నియంత్రణలోను సహాయ పడుతుంది. కొర్రల్లో 8 శాతం ఫైబర్ ఉంటుంది. 12 శాతం ప్రొటీన్లు ఉంటాయి. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకుని తినవచ్చు. ఇందులో కార్బో హైడ్రేట్లు, పీచు పదార్థం, తక్కువ కొవ్వు పదార్థాలు, మెగ్నీషియమ్, ఐరన్, జింక్ వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, బి1, బి2, బి5, బి6, విటమిన్ ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే. మన ఆహరం నుంచి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా ఆర్థిక మొత్తంలో గ్లూకోజ్ ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కలవడాన్ని కొర్ర అన్నం నెమ్మదిపరుస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కొర్రెలను తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.