Komatireddy : ఎంపీ కోమటిరెడ్డి సాక్షిగా రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ ఆఫర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Komatireddy : ఎంపీ కోమటిరెడ్డి సాక్షిగా రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ ఆఫర్?

Komatireddy : నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాళ్లకు ఉన్న క్రేజే వేరు. అందుకే ఇప్పటికే వాళ్లు ఏం చెబితే అదే నడుస్తుంది. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే ఉమ్మడి జిల్లాలో గెలుపు. అందుకే రాజకీయ పార్టీలు కూడా ఈ బ్రదర్స్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాయి. జిల్లా రాజకీయాలకు ఇద్దరు అన్నదమ్ములే ఇప్పటికీ శాసిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 October 2023,5:00 pm

Komatireddy : నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాళ్లకు ఉన్న క్రేజే వేరు. అందుకే ఇప్పటికే వాళ్లు ఏం చెబితే అదే నడుస్తుంది. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే ఉమ్మడి జిల్లాలో గెలుపు. అందుకే రాజకీయ పార్టీలు కూడా ఈ బ్రదర్స్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాయి. జిల్లా రాజకీయాలకు ఇద్దరు అన్నదమ్ములే ఇప్పటికీ శాసిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా భువనగిరి నుంచి ఎంపీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉపఎన్నికల్లో ఓడిపోయారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినా.. అన్న వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.

అయితే.. బీజేపీలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదు. అందుకే ఇతర కీలక నేతలతో కలిసి వేరే పార్టీలోకి వెళ్లాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోమటిరెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ వచ్చినా కూడా గెలిచే పరిస్థితులు లేవని.. అందుకే కాంగ్రెస్ లో చేరితే రాజగోపాల్ రెడ్డి ఎక్కడ నుంచి కోరితే అక్కడ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే.. తనకు మునుగోడు నియోజకవర్గం నుంచి ఇస్తామని కాంగ్రెస్ కన్ఫమ్ చేసిందట. తమ్ముడి చేరికపై అధిష్ఠానంతో కూడా వెంకట్ రెడ్డి మాట్లాడారట. అయితే.. ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు వేరే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

congress bumper offer for komatireddy rajagopal reddy

#image_title

Komatireddy : ఎల్బీ నగర్ నుంచి మల్ రెడ్డి రామ్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు

ఎల్బీ నగర్ నుంచి మల్ రెడ్డి రామ్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్.. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో ఎల్బీ నగర్ కాకుండా వేరే టికెట్ ఏదైనా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎల్బీ నగర్ లో నల్గొండ జిల్లాకు చెందిన సెటిలర్స్ ఎక్కువగా ఉన్నందున.. రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది