Lady Aghori Srivarshini : లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి.. దానికి పనికి రాడని తెలిసికూడా పెద్ద సాహసం చేసింది..!
ప్రధానాంశాలు:
Lady Aghori Srivarshini : లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి.. దానికి పనికి రాడని తెలిసికూడా పెద్ద సాహసం చేసింది..!
Lady Aghori Srivarshini : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మంగళగిరికి చెందిన యువతి శ్రీవర్షిణితో గత నెలలో పారిపోయిన లేడీ అఘోరీ, గుజరాత్‌లో పోలీసులు పట్టుకున్నారు. శ్రీవర్షిణిని తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పగించినప్పటికీ, శ్రీవర్షిణి స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను లేడీ అఘోరిని ప్రేమించి, తన ఇష్టంతో తాళి కట్టించుకున్నానని వెల్లడించింది. అతను సంపూర్ణంగా పురుషుడి పాత్రను పోషించకపోయినా, తన మనసులో భర్తగా నిలిచిపోయాడని తేల్చి చెప్పింది.

Lady Aghori Srivarshini : లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి.. దానికి పనికి రాడని తెలిసికూడా పెద్ద సాహసం చేసింది..!
Lady Aghori Srivarshini : సంసారానికి పనికిరాని అఘోరిని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి
అఘోరీ మంగళగిరిలో బట్టలు లేకుండా రచ్చచేసిన సమయంలో శ్రీవర్షిణి అతనికి బట్టలు తీసుకెళ్లి ఇచ్చింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అఘోరీతో కలిసి ఆమె తన జీవితాన్ని మార్చుకున్నది. విజయవాడ కనకదుర్గ గుడిలో తాము పెళ్లి చేసుకున్నామని ఇద్దరూ ప్రకటించారు. వివాహానంతరం కాశీ, ఇతర పవిత్ర ప్రాంతాల్లో పర్యటన చేశామన్న లేడీ అఘోరీ, చట్టపరంగా భార్యాభర్తలుగా తమకు అన్ని హక్కులు లభిస్తాయని అన్నారు.
తనకు సంసార సుఖం అవసరం లేదని, ఆధ్యాత్మిక జీవనం గడుపుతానని శ్రీవర్షిణి వెల్లడించింది. తన బాల్యం నరకంలా గడిచిందని, అఘోరితో జీవనం మక్కువ కలిగించిందని వివరించింది. ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకున్నామని, సమాజ భయం వల్ల కొంతకాలం రహస్యంగా ఉంచామని కూడా చెప్పింది. ఈ అఘోరీ-వర్షిణి ప్రేమకథ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చనీయాంశంగా మారింది. లేడి అఘోరిని పెళ్లి చేసుకొని వర్షిణి తప్పు చేసిందని చాలామంది అంటున్నారు. మరి వీరి జీవనం ఇప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.