Mohan Babu : గురు పౌర్ణమి సందర్భంగా మోహన్ బాబు పొలిటికల్ సంచలన వ్యాఖ్యలు..!!
Mohan Babu : సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యక్తిగతంగా ఆయన శిరిడి సాయిబాబాని ప్రత్యేకంగా పూజిస్తారు. అప్పట్లో ప్రతి ఏడాది షిరిడి వెళ్లి ఆయన నామస్మరణ చేసుకునేవారు. తెలుగు చలనచిత్ర రంగంలో హీరోగా విలన్ ఇంకా అనేక పాత్రలు చేసి ఆల్రౌండర్ నటుడిగా మోహన్ బాబు పేరు సంపాదించుకోవడం జరిగింది. ఏ విషయమైనా ముక్కుసూటి దానంతో చెట్టే మోహన్ బాబు రాజకీయాల్లో కూడా రాణించారు.
2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత కొద్దిగా రాజకీయంగా చాలా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో బిజెపి పార్టీకి కొద్దిగా దగ్గరవుతూ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనే తన విద్యా సంస్థల వద్ద షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించడం తెలిసిందే. ఈ మందిరాన్ని నిర్మించాక వచ్చిన మొదటి గురు పౌర్ణమి పండుగ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంత సురక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన విద్యాసంస్థలు మరియు తిరుపతి చుట్టుప్రక్కల మొత్తం దైవనామ స్మరణతో మారు మ్రోగుతుందని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో తాను నిర్మించిన షిరిడి సాయిబాబా మందిరం గురించి మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు శిరిడి సాయిబాబా.. ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు దేశం సంతోషంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
