Donald Trump : వారికి పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులు మ‌న దేశంలో ఉండ‌కూడ‌దు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Donald Trump : వారికి పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులు మ‌న దేశంలో ఉండ‌కూడ‌దు

 Authored By ramu | The Telugu News | Updated on :11 December 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Donald Trump : వారికి పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులు మ‌న దేశంలో ఉండ‌కూడ‌దు

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ అమెరికన్ హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమిస్తూ తన పాలకవర్గానికి ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్​ను సులభతరం చేస్తామని పేర్కొన్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి వెల్లగొడతానని తెలిపారు. చట్టబద్ధంగా తమ దేశానికి రావాలనుకునేవారి కోసం ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్​ను సింప్లిఫై చేస్తానని ట్రంప్ ప్రకటించడం వల్ల యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు భారీ ఊరట కలగనుంది

Donald Trump వారికి పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్ ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులు మ‌న దేశంలో ఉండ‌కూడ‌దు

Donald Trump : వారికి పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులు మ‌న దేశంలో ఉండ‌కూడ‌దు

Donald Trump వారిపై కొర‌డా..

వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తాను. నియమనిబంధనలు, చట్ట ప్రకారమే అమెరికాకు రావాలి. అక్రమంగా కాదు. యూఎస్​కు వచ్చేందుకు 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. వారందరూ అక్రమ వలసదారుల వల్ల అన్యాయానికి గురయ్యారు. అమెరికాకు రాబోయేవారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి. అమెరికా గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే దేశాన్ని ప్రేమించాలి. నేరస్థులు అమెరికాకు వద్దు. గత మూడేళ్లలో అమెరికాకు 13,099 మంది నేరస్థులు వచ్చారు. దేశ నడివీధుల్లో వారు నడుస్తున్నారు. వారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు దేశానికి వద్దు. మన దేశం నుంచి నేరస్థులను తరిమి కొట్టాలి.” ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల సమస్యను హైలైట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలలో పత్రాలు లేని వ్యక్తులు ఓటు హక్కు కల్పించారని ఆరోపించారు. డ్రీమర్‌ ఇమిగ్రెంట్స్‌ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తానన్నారు డొనాల్డ్ ట్రంప్. “వారి కోసం మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే వారు చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వ్యక్తులు. నేను డెమొక్రాట్‌లతో కలిసి ఒక ప్రణాళికతో పని చేస్తాను. రిపబ్లికన్లు డ్రీమర్ ఇమ్మిగ్రెంట్స్​కు అండగా ఉంటారు” అని ట్రంప్ తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది