Ustaad Movie Review : ‘ఉస్తాద్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ustaad Movie Review : ‘ఉస్తాద్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Ustaad Movie Review : ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్. అది కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందింది కాదు.. రాజమౌళి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ దర్శకుల్లో ఒకరు. అందుకే రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఫ్యామిలీలో చాలామంది సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి ఒక హీరో కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అతడి పేరు శ్రీ సింహ కోడూరి. ఆయన హీరోగా వచ్చిన మత్తువదలరా మూవీ గురించి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 August 2023,12:30 pm

Ustaad Movie Review : ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్. అది కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందింది కాదు.. రాజమౌళి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ దర్శకుల్లో ఒకరు. అందుకే రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఫ్యామిలీలో చాలామంది సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి ఒక హీరో కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అతడి పేరు శ్రీ సింహ కోడూరి. ఆయన హీరోగా వచ్చిన మత్తువదలరా మూవీ గురించి తెలుసు కదా. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించినా అంతగా అవి గుర్తింపును తీసుకురాలేదు. తాజాగా శ్రీ సింహ నటించిన ఉస్తాద్ అనే సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు రాజమౌళినే ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ సినిమాకు బాగా హైప్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

సినిమా పేరు : ఉస్తాద్

నటీనటులు : శ్రీ సింహా కోడూరి, కావ్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర, వెంకటేష్ మహా, రవి శివ తేజ

డైరెక్టర్ : ఫణిదీప్

ప్రొడ్యూసర్ : రజినీ కొర్రపాటి, హిమాంక్ రెడ్డి, రాకేష్ రెడ్డి గడ్డం

ఎడిటర్ : కార్తీక్ కట్స్

రిలీజ్ డేట్ : 12-08-2023

Ustaad Movie Review : కథ ఏంటంటే?

ఈ సినిమాలో హీరో పేరు సూర్య. మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తారు. అందుకే మనోడు ఏం చేస్తాడో మనోడికే తెలియదు. కానీ.. చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు. దీంతో తల్లి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచుతుంది. కానీ.. మనోడికి అసలు జీవితంలో ఏం చేయాలి.. ఏం అవ్వాలి అనేదానిపై ఒక క్లారిటీ ఉండదు. అప్పటికప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు కానీ.. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏం ఉండదు. అప్పటికప్పుడు కోపం వచ్చినా ఆగడు.. సంతోషం వచ్చినా ఆగడు. అయితే.. తను డిగ్రీ చదివే రోజుల్లో ఒక బైక్ ను కొంటాడు. దానికి ఉస్తాద్ అనే పేరు పెడతాడు సూర్య. ఇక.. ఆ బైక్ ను ప్రాణంగా చూసుకుంటాడు. సాధారణంగా ఎవరైనా తమ ఫ్రెండ్స్ కి, దగ్గరి వారికి తమ మనసులో మాటలు చెబుతుంటారు. కానీ.. సూర్య మాత్రం ఆ బైక్ తోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ బైక్ సూర్యకు మేఘనను దగ్గర చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే సూర్య పైలెట్ అవ్వాలని అనుకుంటాడు. అప్పుడు తనకు ఏం జరుగుతుంది. వాళ్ల ప్రేమ ఫలిస్తుందా? తన లక్ష్యం నెరవేరుతుందా? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

Ustaad Movie Review : విశ్లేషణ

ఇక.. ఆ కథను విశ్లేషిస్తే నిజానికి ఇది ఒక కొత్త కథ అనే చెప్పుకోవాలి. ఇలాంటి కథనంతో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు. ఒక బైక్ తో వ్యక్తి ప్రయాణం అనేది కొత్త కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ను వెండి తెర మీద చక్కగా చూపించగలిగాడు డైరెక్టర్. ఎలాంటి లక్ష్యం లేని వ్యక్తికి ఒక బైక్ పరిచయం అయితే.. ఆ బైక్ ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేసింది. తన లక్ష్యం చేరుకోవడంలో ఆ బైక్ ఎలా సాయ పడింది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. స్టూడెంట్ గా ఎలా ఒక వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత ప్రేమికుడిగా ఎలా ఉంటాడు. ఫ్యామిలీలో ఎలా బాధ్యతగా ఉంటాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఎంత కష్టపడతాడు అనే రకరకాల కోణాలను ఇందులో స్పృశించారు.

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ సింహ అయితే సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు అనే చెప్పుకోవాలి. హీరో తల్లి పాత్రలో నటించిన అను హాసన్ పర్లేదు అనిపించింది. మేఘనగా నటించిన కావ్య తన ప్రతిభను చాటింది.

ప్లస్ పాయింట్స్

సినిమా కథ

శ్రీ సింహా నటన

హీరో క్యారెక్టరైజేషన్

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్

స్లో నరేషన్

క్లైమాక్స్

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది