Beast Movie Review : విజయ్ బీస్ట్ మూవీ రివ్యూ, రేటింగ్..!
Beast Movie Review: చివరిగా మాస్టర్ సినిమాతో ప్రేక్షకులని అలరించిన స్టార్ హీరో విజయ్ తాజాగా బీస్ట్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ప్రతీ సినిమాలో విజయ్ యాక్టింగే హైలెట్‌గా నిలుస్తోంది. ‘బీస్ట్’లో కూడా అంతే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన బీస్ట్.. ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో బీస్ట్ షోలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు నయనతారతో కోకిల, శివ కార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ .. విజయ్‌తో ఎలాంటి సినిమా చేస్తారోనని అందరిలో తెలియని ఆసక్తి నెలకొంది. దానికి తెరపడింది.
Beast Movie Review కథ
వీర రాఘవన్ (విజయ్) ఒక రా ఏజెంట్. కానీ తన వృత్తి గురించి బయటపెట్టకుండా ఓ మాల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజు ఆ మాల్‌లో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. ఆ టెర్రరిస్ట్ అటాక్ నుండి ప్రజలను చాకచక్యంగా కాపాడతాడు వీర సీక్రెట్ ఆపరేషన్ లో ఊహించని విధంగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఓ చిన్నారి చనిపోతుంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వృత్తి జీవితానికి దూరంగా ఉంటాడు వీర రాఘవన్. అంతేకాదు ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి తీసుకునే ట్రీట్మెంట్ లో భాగంగా ప్రీతి (పూజా హెగ్డే)ను కలుస్తాడు. ఆమె కూడా లవ్ ప్రపోజ్ చేస్తుంది . అయితే అసలు నేరస్తుడిని ఎలా పట్టుకుండు అనేదే సినిమా కథ:
విజయ్ లాంటి హీరో, అన్ని కోట్ల బడ్డెట్, నెంబర్ వన్ టెక్నీషియన్స్ తో సినిమా తెరకెక్కించగా, ఈ సినిమాలో కొంత స్టఫ్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎవరు టెర్రిరిస్ట్ లుగా ట్రైనింగ్ ఇచ్చారో…ఇలాంటి టెర్రిరిస్ట్ లను వాళ్ల ఆర్గనైజేషన్ ఏం సాధిస్తుంది…తమ లీడర్ ని జైలు నుంచి విడిపించుకునేటంత సీన్ ఉన్న వాళ్ళు కాదు. అసలు ఈ టెర్రిరిస్ట్ లు బీస్ట్ లాంటి రా ఏజెంట్ ని ఎదిరించి తన నాయకుడుని ఎలా విడిపించుకున్నరో చూపెడితే టెర్రిరిస్ట్ లు అయినా స్పెషల్ షోలు వేసుకుని చూసుకుని వారేమో. అంత దారుణంగా ఉంది. విలన్ వెర్శస్ హీరో వ్యవహారం. విలన్స్ అంత వీక్ గా ఉంటే ఇంక హీరోకు బీస్ట్ అని పేరు పెట్టి బరిలోకి వదిలినా ఫలితం ఏముంది.. గ్రిప్పింగ్ గానీ థిల్లింగ్ కానీ ఎమోషన్స్ లేని యాక్షన్ హోస్టేజీ డ్రామా ఇది.
Beast Movie Review ప్లస్ పాయింట్స్:
విజయ్ నటన
పూజా అందం
బీజీఎం
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
స్టోరీ
కొందరు నటులు
విశ్లేషణ: బీస్ట్ సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి.ఇది విజయ్ ఫ్యాన్స్ కి అంతో ఇంతో నచ్చుతుందని, కానీ జనరల్ ఆడియెన్స్ కి నిరాశ తప్పదని చెబుతున్నారు. పూజా గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ అని, మంచి కమర్షియల్ చిత్రమని అంటున్నారు. మొత్తంగా ట్విట్టర్ ఆడియెన్స్ నుంచి మాత్రం `బీస్ట్` చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది.