Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే.. వరల్డ్ కప్ లో ఆడుతాడా? లేదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే.. వరల్డ్ కప్ లో ఆడుతాడా? లేదా?

 Authored By kranthi | The Telugu News | Updated on :30 October 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  పాండ్యా తిరిగి జట్టులో చేరబోతున్నాడా?

  •  పాండ్యాకు అయిన గాయం మానిందా?

  •  ఆల్ రౌండర్ కు ఇంకా రెస్ట్ అవసరమా?

Hardik Pandya : హార్దిక్ పాండ్యా… టీమిండియాకు కీలక ప్లేయర్. అతడు లేని లోటు ఇప్పుడు టీమిండియాకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. హార్ధిక్ పాండ్యా లేకపోవడం వల్ల టీమిండియాకు మిడిలార్డర్ చాలా సమస్యగా మారింది. అలాగే బౌలింగ్ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. బౌలింగ్ వేస్తూనే పాండ్యా గాయపడ్డాడు. మూడో బంతి వేసిన తర్వాత వచ్చే బంతిని ఆపడం కోసం తన కాలిని అడ్డం పెట్టడంతో పట్టుతప్పి కింద పడ్డాడు. దీంతో అతడికి కాలి మణికట్టుకు గాయం అయింది. ఆ గాయం వల్ల హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు గాయం నుంచి బయటపడలేదు. ప్రస్తుతం ఆయన జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ లలో హార్ధిక్ ఆడలేదు. ఒక రకంగా చెప్పాలంటే హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్. అలాంటి కీలక ఆటగాడు.. రెండు మ్యాచ్ లలో మిస్ అవడంతో టీమిండియాకు ఒత్తిడి పెరుగుతోంది. అందుకే.. మళ్లీ ఎప్పుడు టీమిండియాతో జాయిన్ అవుతాడు అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

అయితే.. హార్ధిక్ పాండ్యా ఫిట్ నెస్ పై తాజాగా లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. పాండ్యా ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. భారత్ తదుపరి మ్యాచ్ నవంబర్ 2న శ్రీలంకతో జరగనుంది. ఆ మ్యాచ్ లో టీమిండియాతో హార్దిక్ పాండ్యా జాయిన్ అవుతాడు అని తెలుస్తోంది. బెంగళూరు నుంచి నేరుగా హార్దిక్ పాండ్యా ముంబై చేరుకొని అక్కడే టీమిండియాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. శ్రీలంక మ్యాచ్ ముంబైలో జరగనుంది. ఈనేపథ్యంలో హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. తన గాయం మానినా.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు. నవంబర్ 2 నుంచి టీమిండియాతో జాయిన్ అయి మళ్లీ మునుపటి ఫామ్ తో క్రికెట్ ఆడే అవకాశం ఉంది.

Hardik Pandya : ఆల్ రౌండర్ కాబట్టే హార్ధిక్ పాండ్యా జట్టుకు కీలకం

పాండ్యా ఆల్ రౌండర్. మంచి బ్యాట్స్ మెన్, మంచి బౌలర్. మంచి ఫీల్డర్ కూడా. అలాంటి వ్యక్తి టీమ్ లో ఉంటే టీమ్ కు కొండంత బలం. అందుకే.. పాండ్యా లేని లోటు మునుపటి రెండు మ్యాచ్ లలో స్పష్టంగా తెలిసింది. అందుకే టీమిండియాకు కీలకమైన తదుపరి మ్యాచ్ లలో హార్దిక్ పాండ్యాను తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. చూద్దాం మరి అప్పటి వరకు పాండ్యా మ్యాచ్ కు సన్నద్ధం అవుతాడో లేదో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది