CM Revanth Reddy : బ‌డా బాబులు అయిన‌, సెల‌బ్రిటీలు అయిన ఆ విష‌యం వ‌దిలేదే లేద‌న్న రేవంత్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : బ‌డా బాబులు అయిన‌, సెల‌బ్రిటీలు అయిన ఆ విష‌యం వ‌దిలేదే లేద‌న్న రేవంత్ రెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,5:00 pm

CM Revanth Reddy : అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి రేవంత్ రెడ్డి త‌న‌దైన పాల‌నతో దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన ప‌దేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా, రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో సుప‌రిపాల‌న న‌డుస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుండ‌డంపై అంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయాలని భావించి ప్రత్యేక చర్యలు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. కమాండ్ కంట్రోల్‌లో ఉండే అధికారులు విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు.

CM Revanth Reddy : ఎవ‌రిని వ‌దిలేది లేదు..

అయితే నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదు అని ఆదేశించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే యువతపై డ్రగ్స్, మత్తు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి గంజాయి, మాదక ద్రవ్యాలు.. ఇతర రాష్ట్రాలనుంచి, ప్రాంతాలనుంచి వస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు సరిహద్దుల్లో నిఘా పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలన్నారు.

“ప్రభుత్వం మీ వెనక ఉంది, భయపడకండి, ఎలాంటి బడా బాబులు ఉన్నా ఉక్కుపాదం మోపండి” అని అధికారులకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అనే పేరు వినపడితేనే వాటితో సంబంధం ఉన్న వారు వణికిపోవాలన్నారు. తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. యాంటీ నార్కోటిక్‌ బ్యూరో.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. ఇటీవల బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో ఈ సమీక్షపై ఉత్కంఠ నెలకొంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది