Ginger : అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ginger : అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!

Ginger : అల్లం.. మన ఆహారంలో ఒక భాగం అయిపోయింది. అది చాయ్ అయినా.. కూర అయినా.. ఇంకే వంటకం అయినా సరే.. అల్లం లేకుండా మనకు రోజు గడవదు. నిజానికి అల్లం అనేది ఆరోగ్యానికి అమ్మ వంటిది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే.. చాలామంది అల్లాన్ని రోజూ వంటల్లో వాడుతుంటారు. కాస్త తలనొప్పిగా ఉన్నా సరే.. ఒక అల్లం చాయ్ తాగేస్తాం. దెబ్బకు తలనొప్పి తగ్గుతుంది. మన వంటింట్లో ఏది ఉన్నా లేకున్నా.. అల్లం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 July 2021,8:11 am

Ginger : అల్లం.. మన ఆహారంలో ఒక భాగం అయిపోయింది. అది చాయ్ అయినా.. కూర అయినా.. ఇంకే వంటకం అయినా సరే.. అల్లం లేకుండా మనకు రోజు గడవదు. నిజానికి అల్లం అనేది ఆరోగ్యానికి అమ్మ వంటిది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే.. చాలామంది అల్లాన్ని రోజూ వంటల్లో వాడుతుంటారు. కాస్త తలనొప్పిగా ఉన్నా సరే.. ఒక అల్లం చాయ్ తాగేస్తాం. దెబ్బకు తలనొప్పి తగ్గుతుంది. మన వంటింట్లో ఏది ఉన్నా లేకున్నా.. అల్లం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే.. చాలామందికి అల్లాన్ని ఎలా తినాలో తెలియదు. అల్లాన్ని తినే పద్ధతి ఒకటి ఉంటుంది. ఎలా పడితే అలా అల్లాన్ని తినేస్తే మాత్రం మనకే డేంజర్.

ginger health benefits telugu

ginger health benefits telugu

చాలామంది అల్లాన్ని పొట్టు తీయకుండానే తినేస్తారు. తొక్క తీయకుండానే దాన్ని రుబ్బి కూరల్లో వాడుతుంటారు. అలా తినడం కరెక్టేనా? చాలామందికి తెలియదు. నిజానికి.. అల్లాన్ని అలాగే తొక్క తీయకుండా తినకూడదట. అలా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయట. ఎందుకంటే.. అల్లం అనేది భూమి లోపల పండే పంట కాబట్టి.. భూమి లోపల ఉన్నప్పుడు.. అల్లం తొక్క.. సూక్ష్మజీవులతో పోరాడుతుంది. పంట కోసం వాడే రసాయనాలను కూడా అది పీల్చుకుంటుంది. కాబట్టి ఆ తొక్కను తినకుండా దాన్ని తీసేసి అల్లాన్ని తినాలి. ఒకవేళ.. తొక్కతో సహా.. అల్లాన్ని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ginger health benefits telugu

ginger health benefits telugu

Ginger : తొక్క తీయకుండా తింటే ఏమౌతుంది?

అల్లాన్ని తొక్క తీయకుండా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అల్లం తొక్కలో ఉండే విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి.. శరీరంలో ఎన్నో సమస్యలను సృష్టిస్తాయి. చాలా సమస్యలకు కారణం అవుతాయి. తొక్కను కడిగినా కూడా తొక్కలోని విష పదార్థాలు అలాగే ఉంటాయి. దీని వల్ల.. కాలేయం దెబ్బ తింటుంది. ఆ విష పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపించడానికి కాలేయం తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. దాని వల్ల.. దానికి పని ఒత్తిడి ఎక్కువై అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే.. విష పదార్థాల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అవి ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తాయి. అందుకే.. అల్లాన్ని తొక్క తీసేసి తినడం మేలు.

ginger health benefits telugu

ginger health benefits telugu

ఇది కూడా చ‌ద‌వండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది