Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ రాజకీయం ముగిసినట్లేనా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ రాజకీయం ముగిసినట్లేనా…!

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,5:00 pm

Vallabhaneni Vamsi : రాజకీయం అనేది కొన్ని సందర్భాలలో ఎంత పెద్ద నాయకుడుని అయినా సరే నేల మీద పడేలా చేస్తాయని చెప్పాలి. అలాగే ఎన్నో ఏళ్లుగా నేలపై ఉన్న వ్యక్తిని రాజ్యాన్ని ఏలించే సత్తా రాజకీయానికి ఉంటుంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితంలో రాజకీయ నాయకుల పరిస్థితి గురించి చర్చించటం చాలా కష్టమైన విషయం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ నేల మీద పడిపోతున్నారా లేక తిరిగి నిలబడగలుగుతారా అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయితే 2019 ఎపి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి అత్యంత హీనమైన దారుణమైన ఓటమికి చవిచూశారు.ఆ సమయం లో టీడీపీ నుంది కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినప్పుడు ,వారిలో ఒకరిగా ఉన్న వల్లభనేని వంశీ గెలిచిన కొన్నాళ్లకే వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపించారని చెప్పాలి. ఈ తరుణంలోనే టిడిపి అధినేత చంద్రబాబుని అలాగే నారా లోకేష్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. టిడిపి పార్టీ నుండి ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు అనే విషయానికొస్తే…

వైసీపీ పార్టీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి నియోజకవర్గం ఇన్చార్జిల మార్పులు ఇంకా వల్లభనేని వంశీ పేరు ఎందుకు రాలేదు. అయితే వైసిపి పార్టీ నుంచి దాదాపు ఇప్పటివరకు 6 లిస్టులు వచ్చాయి. ఈ క్రమంలోనే 40 నుండి 50 మందిని మార్చారు. అదేవిధంగా ఒక 12 మంది ఎంపీలను కూడా పూర్తిగా పార్టీ నుండి జగన్ తొలగించారు. ఇక ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో ఇప్పటివరకు వల్లభినేని వంశీ పేరు ఎందుకు రాలేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి నెక్స్ట్ లిస్టులో అన్న వస్తుందో లేదో చూడాలి . ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఎందుకు యాక్టివ్ గా కనిపించడం లేదు. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు. గడిచిన ఆరు నెలలుగా చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ ఇంతవరకు ఎక్కడ కనిపించడం లేదు. ఇక తన సొంత సామాజిక వర్గం నుండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా వెళ్లినందుకు తెలుగుదేశం పార్టీని వదిలేసినందుకుగాను వల్లభనేని వంశీ పై చాలా వ్యతిరేకత వచ్చిందని చాలామంది చెబుతున్నారు . యార్లగడ్డ వెంకట్రావు అనేటువంటి వ్యక్తి ఒక హీరోగా గన్నవరంలో వెలిగారు అని చెప్పాలి. ఒకప్పుడు వల్లభనేని వంశీ కూడా అదే విధంగా కనిపించారు కానీ ఇప్పుడు గన్నవరంలో ఎవరు హీరోగా లేరు. అందరూ జీరోలానే కనిపిస్తున్నారు.

అయితే ప్రస్తుతం గన్నవరం ను పార్థసారథి అనే వ్యక్తికి ఇవ్వబోతున్నారు అని, ఆ వ్యక్తి గన్నవరం నుండి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఏదైతే ఉందో ఇది వల్లభనేని వంశీని జగన్ పక్కన పెడతారా అనే అనుమానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం గురించి కొన్ని చేయకూడని వ్యాఖ్యలు వల్లభనేని వంశీ చేయడం వలన మరి ముఖ్యంగా ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడడం ఆయన సామాజిక వర్గం నుండి ఆయనకు తీవ్రంగా వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ కూడా కాస్త సైలెంట్ గా ఉంటున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆయన చేసిన తప్పును ఆయన అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని వల్లభనేని వంశీ దూకుడు చాలా వరకు తగ్గింది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరుణంలో వల్లభనేని వంశీ పూర్తిగా రాజకీయాల్లో కింద పడిపోతారా లేదా ఎమ్మెల్యేగా బరిలో దిగి మళ్ళీ దూకుడు ప్రదర్శిస్తారా అనేది చూడాల్సి ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది