Anchor Suma : సుమ ఏంటి ఇంతలా మారిపోయింది.. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తోన్న యాంకర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : సుమ ఏంటి ఇంతలా మారిపోయింది.. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తోన్న యాంకర్

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,3:20 pm

Anchor Suma : యాంకర్ సుమ ఇప్పుడు బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సుమ మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది. అక్కడ తన అభిమానులను అలరిస్తోంది. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో సుమ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. సుమ చేసే వినోదం, కామెడీ వీడియోలకు అందరూ ఫిదా అవుతుంటారు. కరోనా నుంచి సుమ ఇలా నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్ అయింది. అప్పటి నుంచి తన ఫ్యాన్స్‌ను మరింతగా ఎంటర్టైన్ చేసేందుకు కొత్త కొత్తగా వస్తోంది. వంటల వీడియోలు, ఇంట్లో పెట్‌తో ఆడుకునే వీడియోలు, లిఫ్ట్‌లో తన తల్లితో కలిసి వీడియోలతో సుమ అందరినీ ఆకట్టుకుంది.

తినే వీడియోలు, కేరవ్యాన్ విశేషాలు, సెట్స్‌లో సుమ చేసే అల్లరి ఇలా అన్నింటిని చూపిస్తూ వస్తోంది. తన ఫాలోవర్లను అలరిస్తూ ఇంకా ఇంకా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక ఆమె బిహెండ్ ది సీన్స్ అంటూ మేకప్ వీడియోలు, ఈవెంట్ వెనకాల జరిగే సంగతులు, షోలో షూటింగ్ గ్యాప్‌లో అందరూ ఎలా ఉంటారు..ఏం చేస్తుంటారో చూపిస్తుంటుంది. తాజాగా సుమ రీల్ వీడియోలతో సందడి చేస్తోంది. ఆ మధ్య న్యూ యార్క్‌లో సుమ చేసిన వీడియోలు, నడి వీధుల్లో ఆమె వేసిన చిందులు, రెస్టారెంట్లలో రోబోలతో సేవలు ఇలా అన్నీ కూడా తెగ వైరల్ అయ్యాయి. సుమ చేసే రీల్ వీడియోలు ఇలా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సుమ అందరినీ నవ్వించేసింది.

Anchor Suma Funny Reel on Phone Conversation

Anchor Suma Funny Reel on Phone Conversation

అందులో సుమ ఫోన్ సంభాషణ ఎలా ఉంటుందో చూపించింది. కొంత మంది పెద్దవాళ్లు ఎలా మాట్లాడతారో చూపించింది. ఇక ఇందులో భాగంగా సుమ మరీ ముసల్దానిలా గెటప్ వేసుకుని కనిపించింది. వయసు మీద పడిన వాళ్ల చాదస్తం ఎలా ఉంటుంది.. ఎలా మాట్లాడతారు.. ప్రశ్నలు వాళ్లే వేసి.. జవాబులు కూడా వాళ్లే వేస్తుంటారు.. అలాంటి ఓ సంభాషణను సుమ చూపించింది. ఇందులో సుమ రెండు వేరియేషన్స్‌లో కనిపించింది. ప్రస్తుతం సుమ ఈ వీడియోతో అందరినీ నవ్వించేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakalla (@kanakalasuma)

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది