Bigg Boss : ఈ వారం వరస్ట్ పర్ ఫార్మర్ ఎవరు? నువ్వంటే నువ్వు అంటూ హౌస్ లో లొల్లి.. వీడియో
Bigg Boss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 స్టార్ట్ అయి నెల దాటింది. దీంతో రోజు రోజుకూ హౌస్ లో కంటెస్టెంట్లకు రకరకాల టాస్కులను పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమ, లహరి, నటరాజ్ మాస్టర్.. వెళ్లిపోయారు. హౌస్ రోజు రోజుకూ వేడెక్కుతోంది. కంటెస్టెంట్లు కూడా ఎవ్వరూ తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. గొడవలు కూడా బాగానే జరుగుతున్నాయి. దీంతో బిగ్ బాస్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది.

bigg boss telugu season 5 this worst performer task
టఫ్ టాస్కులను పెట్టడం, కంటెస్టెంట్ల మధ్య గొడవలు సృష్టించేలా చేసి.. వాళ్లు గొడవ పడేలా చేయడంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఇదివరకు వచ్చిన సీజన్ల కంటే ఈ సీజన్ అందుకే కాస్త ప్రేక్షకులకు నచ్చుతోంది. కాంట్రవర్సీలు పెరిగాయి.
Bigg Boss : వరస్ట్ పర్ ఫార్మర్ గా ఇంటి సభ్యులు ఎవరిని ఎన్నుకున్నారు?
తాజాగా.. ఈ వారం వరస్ట్ పర్ ఫార్మర్ ఎవరో సెలెక్ట్ చేసి.. బిగ్ బాస్ కు చెప్పాలంటే బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు.. ఈవారానికి వరస్ట్ పర్ ఫార్మర్ ఎవరో సెలెక్ట్ చేసుకొని.. తగిన కారణాలు చెప్పి ఆ కంటెస్టెంట్ ముఖాన నీళ్లు కొట్టాలని చెబుతాడు.
ఇక.. స్టార్టింగ్.. స్టార్టింగే.. సన్నీ ఎమోషనల్ అవుతాడు. నేను ఎవ్వరితో గొడవ పెట్టుకోకూడదు అని అనుకుంటున్నా కానీ.. నా కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నా.. అని అంటాడు.
నాకు, సన్నీ, అనీ మేడమ్ కు ఒక ఫ్రెండ్ షిప్ ఉంది. అది ఒక టాస్క్ తో ఎండ్ అయ్యేది కాదు. దయచేసి.. మా ముగ్గురిని ఇన్ ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నించకండి.. అంటూ శ్వేత ఎవరికో వార్నింగ్ ఇస్తుంది. దమ్ముంటే ముందు నుంచి ఆడండి.. వెనుక నుంచి కాదు… అని సిరి కూడా వార్నింగ్ ఇస్తుంది.
విశ్వ, షణ్ముఖ్ మధ్య కూడా గొడవ అవుతుంది. జెస్సీ అయితే.. ఒక్కసారిగా సీరియస్ అయి నాకు కుకింగ్ రాదు.. నన్ను కుకింగ్ చేయాలంటూ ఇబ్బంది పెట్టొద్దు అంటూ సీరియస్ అవుతాడు. మానస్, శ్రీరామ్ మధ్య కూడా గొడవ అవుతుంది. ఎవ్వరి మీద చేయి ఎత్తకు నొప్పి అయితది.. నీ క్లాస్ లు ఇక్కడ కాదు అంటూ కాజల్ కు చురకలంటిస్తాడు రవి. మొత్తం మీద ఈ వారం వరస్ట్ పర్ ఫార్మర్ ను ఎన్నుకోవడం కోసం హౌస్ మొత్తం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా ట్విట్టర్ లో విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేసుకోండి.
Who is the worst performer for this week?? Miru evarini nominate chestharu?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFire & #FiveMuchFun pic.twitter.com/a8NFfjfGWk
— Starmaa (@StarMaa) October 8, 2021