Nara Lokesh : సీఐడీ విచారణకు నారా లోకేష్ హాజరు.. విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Lokesh : సీఐడీ విచారణకు నారా లోకేష్ హాజరు.. విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా?

Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబును రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ముందు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆ రిమాండ్ ను మళ్లీ పెంచారు. రాజమండ్రి జైలులోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. కానీ.. ఇప్పటి వరకు సీఐడీ అధికారులకు చంద్రబాబు సహకరించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అసలు ఏం జరిగింది. షెల్ కంపెనీల […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 October 2023,10:46 am

Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబును రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ముందు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆ రిమాండ్ ను మళ్లీ పెంచారు. రాజమండ్రి జైలులోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. కానీ.. ఇప్పటి వరకు సీఐడీ అధికారులకు చంద్రబాబు సహకరించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అసలు ఏం జరిగింది. షెల్ కంపెనీల పేరుతో ఎలా కోట్లకు కోట్లు నొక్కేశారు అనే దానిపై చంద్రబాబును సీఐడీ అధికారులు చాలా ప్రశ్నలు వేశారు. కానీ.. చంద్రబాబు మాత్రం వేటికీ సరైన సమాధానం చెప్పడం లేదు. ఓవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబపై విచారణ జరుగుతుండగానే మరో మూడు స్కామ్ లపై కూడా ఆయనపై కేసులు నమోదు చేశారు. వాటిపై ముందస్తు బెయిల్ కు కూడా చంద్రబాబు పిటిషన్ వేసినా బెయిల్ ఇవ్వలేదు.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా ఏపీ సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే.. చంద్రబాబు అరెస్ట్ పై ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్న సమయంలోనే ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లి మరీ నారా లోకేష్ కు నోటీసులు జారీ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో నారా లోకేష్ పేరుతో పాటు హెరిటేజ్ సంస్థ పేరు కూడా ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ ను మాత్రం సీఐడీ అధికారు విచారిస్తున్నారు. తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు ఉదయమే నారా లోకేష్ చేరుకున్నారు. నారా లోకేష్ ను సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నట్టు తెలుస్తోంది. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చాలని సీఆర్డీఏపై నారా లోకేష్ ఒత్తిడి తెచ్చారని ఆయనపై సీఐడీ ప్రధాన అభియోగాలు మోపింది.

nara lokesh attends for cid enquiry in tadepalli

Nara Lokesh : సీఐడీ విచారణకు నారా లోకేష్ హాజరు.. విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా?

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో చంద్రబాబు పేరు కూడా రాశారు. అంతే కాదు.. హెరిటేజ్ సంస్థ పేరు, ఆ సంస్థలో కీలక పదవుల్లో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లను కూడా సీఐడీ అధికారులు చేర్చినట్టు తెలుస్తోంది. అయితే.. నారా లోకేష్ విచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తారా? లేక వదిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది