Bandaru : రోజాను తిట్టిన బండారును ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అమ్మా రోజా నన్ను క్షమించు.. పాపం ఏడ్చుకుంటూ వెళ్లిన బండారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandaru : రోజాను తిట్టిన బండారును ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అమ్మా రోజా నన్ను క్షమించు.. పాపం ఏడ్చుకుంటూ వెళ్లిన బండారు

 Authored By kranthi | The Telugu News | Updated on :4 October 2023,4:00 pm

Bandaru : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పక్కన పెడితే.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రోజా నీ బతుకేంటో మాకు తెలియదా? నువ్వు ఆ సినిమాల్లో నటించడం మాకు తెలియదా? ఆ ప్రూఫ్స్ ఇంకా మా దగ్గర ఉన్నాయి. బయట పెట్టమంటావా? అంటూ బండారు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా మండిపడ్డారు. ఆయనపై కేసు నమోదు చేశారు. తన గురించి తప్పుడు మాటలు మాట్లాడాడని, తన పరువుకు భంగం కలిగించాడని బండారుపై రోజా కేసు నమోదు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బండారుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా. వాళ్లను ఇలాగే ఎవరైనా అంటే.. ఏం చేస్తారు. మీ ఇంట్లో మహిళలను ఎవరైనా ఏమైనా అంటే చూస్తూ ఊరుకుంటారా? టీడీపీ నేతలు కూడా ఆయన మాటలకు మద్దతు ఇస్తున్నారు. నారా లోకేష్.. ఆయన అన్నదాంట్లో తప్పేముంది అన్నట్టుగా ట్వీట్ చేశాడు.. దీంతో రోజాకు తీవ్రంగా కోపం వచ్చింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో బండారుపై విరుచుకుపడింది. తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో బండారు ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. రోజా నన్ను క్షమించు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు బండారు సత్యనారాయణ మూర్తి.

tdp bandaru satyanarayana requests minister roja

#image_title

Bandaru : బండారును రౌండప్ చేసి ఈడ్చుకెళ్లిన పోలీసులు

బండారును పోలీసులు రౌండప్ చేసి మరీ స్టేషన్ కు ఈడ్చుకెళ్లారు. ఆయన్ను పోలీసులు తీసుకెళ్తుంటే బండారు కంటతడిపెట్టాడు. రోజా నన్ను క్షమించు.. తొందరపడి నేను ఏదో వాగాను. నన్ను క్షమించు అని రోజాను బండారు వేడుకున్నాడు. ఆయన్ను అరెస్ట్ చేస్తుంటే కన్నీళ్లు పెట్టడం, ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది