Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్..?
Rohit Sharma : వచ్చే ఏడాది వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ పోరులో టీమిండియా సెమీఫైనల్ లో ఓటమి పాలయ్యింది. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వాళ్లను పక్కన పెట్టేయాలని క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా బీసీసీఐ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఊహించని
షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. విషయంలోకి వెళ్తే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని ఆ స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పజెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. T20 వరల్డ్ కప్ లో భారత్ చాలా చెత్త ప్రదర్శన చేయటంతో అప్పటినుండే రోహిత్ నీ కెప్టెన్సీ బాధ్యతలు నుండి తప్పించాలని డిమాండ్ వస్తుంది. ఇలాంటి తరుణంలో టి20, వన్డేల నుంచి కెప్టెన్ గా రోహిత్ శర్మను పక్కన పెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎప్పటికీ హార్దిక్ పాండ్యాకు సమాచారం.. ఇచ్చినట్లు త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్లు.. మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. 2011లో ధోని నాయకత్వంలో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ గెలవడం జరిగింది. అయితే ఈసారి కూడా మళ్లీ గెలవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు… ఈ క్రమంలో రోహిత్ శర్మాని పక్కన పెట్టడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.