Rohit Sharma : స‌డెన్‌గా రోహిత్ ద‌గ్గ‌రకి ఉరికొచ్చిన అభిమాని.. ఒక్క‌సారిగా జ‌డుసుకొని ఎగిరి గంతేసిన హిట్‌మ్యాన్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rohit Sharma : స‌డెన్‌గా రోహిత్ ద‌గ్గ‌రకి ఉరికొచ్చిన అభిమాని.. ఒక్క‌సారిగా జ‌డుసుకొని ఎగిరి గంతేసిన హిట్‌మ్యాన్..!

Rohit Sharma : ఐపీఎల్ సీజ‌న్ 2024 చాలా రంజుగా సాగుతుంది. ఈ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఒక్క హిట్ కూడా కొట్ల‌లేదు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై జ‌ట్టు పెద్ద‌గా రాణించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జ‌ట్టు మూడింట్లోను ఓట‌మి పాలైంది. అయితే తాజ‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ముంబై త‌ల‌ప‌డ‌గా, మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2024,10:00 am

Rohit Sharma : ఐపీఎల్ సీజ‌న్ 2024 చాలా రంజుగా సాగుతుంది. ఈ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఒక్క హిట్ కూడా కొట్ల‌లేదు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై జ‌ట్టు పెద్ద‌గా రాణించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జ‌ట్టు మూడింట్లోను ఓట‌మి పాలైంది. అయితే తాజ‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ముంబై త‌ల‌ప‌డ‌గా, మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శ‌ర్మ‌పై ఎన్నో అంచ‌నాలు పెట్టుకోగా, ఈ మ్యాచ్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఇక‌ హార్దిక్‌ పాండ్య (34), తిలక్‌ వర్మ (32) పరుగులు చేశారు. యుజువేంద్ర చాహల్‌, బౌల్డ్‌ తలో మూడు వికెట్లు తీయగా, బర్జర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Rohit Sharma గ‌జ గ‌జ వ‌ణికిన రోహిత్

త‌క్కువ ల‌క్ష్య చేధ‌నకి బ‌రిలోకి దిగిన రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రియాన్‌ పరాగ్‌ (54) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సులువుగా గెలిచింది. ముంబయికి ఇది హ్యాట్రిక్‌ ఓటమి కాగా, రాజస్థాన్‌కు హ్యాట్రిక్‌ విజయం. ముంబై బౌల‌ర్ ఆకాశ్ మధ్వాల్ (20/3) చెలరేగినా, కూడా ల‌క్ష్యం త‌క్కువ‌ది కావ‌డంతో ముంబై ఖాతాలో మ‌రో ఓట‌మి వ‌చ్చి చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యాకి నిర‌స‌న బాగానే త‌గిలింది. ఆయ‌న‌ని విమ‌ర్శిస్తూనే ఉన్న స‌మ‌యంలో రోహిత్ క‌ల‌గ జేసుకొని కాస్త న‌చ్చజెప్పారు. ఎంక‌రేజ్ చేయాలి త‌ప్ప అలా విమ‌ర్శించ‌కూడ‌దు అంటూ రోహిత్ సైన్ చేశారు.

ఇక మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని రోహిత్ శర్మను భయపెట్టాడు. ఫస్ట్ స్లిప్‌లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో .. కెప్టెన్ హార్దిక్ పాండ్యా‌తో ఫీల్డ్ సెటప్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ స‌మ‌యంలో సడెన్‌గా ఓ అభిమాని మైదానంలోకి వచ్చాడు. సడెన్ గా అభిమాని తన సమీపింగా రావడంతో రోహిత్ శర్మ గజ్జున వణికాడు. సదరు అభిమానికి దూరంగా జరిగి ఆ త‌ర్వాత తాను అభిమానని గ్రహించి.. హగ్ ఇచ్చాడు. ప‌క్క‌నే ఉన్న ఇషాన్ కిష‌న్‌కి కూడా ఆ అభిమాని హ‌గ్ ఇచ్చి సంతోషంతో వెనుదిరిగాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఈ వీడియోపై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది