Suryakumar Yadav : అందువలనే 360 డిగ్రీ లో ఆడుతున్నా… అసలు సీక్రెట్ బయట పెట్టిన సూర్య కుమార్ యాదవ్…!!
Suryakumar Yadav : భారతీయ స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ పేరు వినగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది 360 డిగ్రీల ఆట. ఏబి డివిలియర్స్ తర్వాత 360 డిగ్రీల ఆట తో ఈ తరహా గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ గ్రీస్లో ఉన్నాడంటే బౌలర్లకి వణుకు పుట్టడం గ్యారెంటీ. ఎందుకంటే వేసినబంతిని వేసినట్లే బౌండరీకి పంపిస్తుంటాడు. ఇలా కూడా అడగవచ్చా అని ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా సూర్యకుమార్ బ్యాటింగ్ ఉంటుంది. అందుకే అందరూ ముద్దుగా సూర్య ని మిస్టర్ 360 అని , స్కై అని పిలుస్తుంటారు. అయితే ప్రస్తుతం టీ20లో సూర్యకుమార్ టాప్ బ్యాటరీగా కొనసాగుతున్నాడు. దీన్ని సాధించడం తనకు ఓ కలలా ఉందని సూర్యకుమార్ చెప్పాడు.దీంతోపాటు పలు ఆసక్తికర విషయాల గురించి
సూర్య కుమార్ తెలియజేశారు. అన్నింటికంటే ఇంట్రెస్టింగా అనిపించింది మాత్రం సూర్య ఆడే 360 డిగ్రీల ఆట అనేది ఎలా వచ్చిందనేది సూర్యనే స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకెళ్తే….సూర్య కుమార్ ఎన్నో ఏళ్లపాటుు దేశవాళీ పోటీలలో ఆడినప్పటికీ అతనికి బాగా గుర్తింపు వచ్చింది మాత్రం ఐపీఎల్ అనే చెప్పాలి. అయితే మొదటిగా ఐపీఎల్ లో కోల్ కతా జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2018లో ముంబై ఇండియన్స్ లోకి వచ్చాక సూర్య కుమార్ పేట్ మారిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చమటలు పట్టించాడు. అలా కొన్నాళ్లపాటు ఎదురులేకుండా ఆడిన తర్వాత మొదటిసారిగా ఈ సంవత్సరం టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు.
ఇప్పుడు టి20లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఉన్న సూర్య వన్డేలో కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు టెస్టులలో చోటు దక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సూర్య. త్వరలో భారతదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఆయన అభిమానులు కూడా 360 డిగ్రీల ఆటను చూడాలనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు తన గురించి అభిమానులకు చెప్పుకొస్తున్న సూర్యు ఇటీవల తన 360 డిగ్రీ ల ఆట వెనక ఉన్నన సీక్రెట్ ని రివిల్ చేశారు. అయితే సూర్యకుమార్ స్కూలు కాలేజీ రోజుల్లో రబ్బర్ బంతితో క్రికెట్ ఆడాడట. వర్షం వస్తున సరే వర్షంలోనే ఎన్నో మ్యాచులు ఆడే వాళ్ళమని, బంతి ఇష్టం వచ్చినట్లు దూసుకొచ్చేదని,
కొన్ని సార్లు ఎక్కువ ఎత్తులో వెళ్లేదని చెప్పుకొచ్చారు. ఇక ఆ టైంలో లెగ్ సైడ్ బౌండరీ దూరంగా ఉండేదని, ఆఫ్ సైడ్ బౌండరీ చాలా దగ్గరగా ఉండేదని దీంతో ఆఫ్ సైడ్ బౌండరీని కొట్టకూడదని నా బాడీని టార్గెట్గా చేసుకొని బంతులు వేసే వారు అని తెలియజేశారుు. ఈ టైంలోనే డిఫరెంట్ డైరెక్షన్ లో కొట్టడం నేర్చుకున్నానని క్రిజ్ లో ఫ్రీగా కదులుతూ శరీరాన్ని అణువుగా తిప్పుతూ బౌండరీస్ కొట్టేవాడు అని తెలియజేశారు. ఇక ఆ టైం లో నేర్చుకున్న టెక్నిక్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అయితే నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం అలా ఆడమని చాలా క్లాస్ గా ప్రాక్టీస్ చేస్తున్నానని సూర్యకుమార్ తెలియజేశారు.