Team India : సెమీస్ కి రెడీ అవుతున్న టీమిండియాకు అతిపెద్ద షాక్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Team India : సెమీస్ కి రెడీ అవుతున్న టీమిండియాకు అతిపెద్ద షాక్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :8 November 2022,1:00 pm

Team India : T20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా సెమీస్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 10వ తారీకు సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది. ఇలాంటి తరుణంలో సెమీస్ కి రెడీ అవుతున్న టీమ్ ఇండియాకు ప్రాక్టీస్ లో అతిపెద్ద షాక్ … ఎదురయ్యింది. మేటర్ లోకి వెళ్తే టీమిండియాకు గాయాల టెన్షన్ వెంటాడుతుంది.

ఆడి లైడ్ లో గురువారం సెమీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత్ కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ కుడిచేతికి బలమైన గాయం తగిలింది. దీంతో వెంటనే రోహిత్ ప్రాక్టీస్ ఆపేసాడు. నెట్స్ నుండి బయటకు వచ్చేసి వెంటనే ఫిజియో చేయించుకోవడం జరిగింది. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ లో రోహిత్ ఆడతాడో లేదో అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.  తగిలిన గాయం బలమైనది కావడంతో కోలుకోవడం కష్టమే అన్నా ప్రచారం జరుగుతుంది.

Team India is getting ready for the semis

Team India is getting ready for the semis

అయితే ఈ టోర్నీలో రోహిత్ ఐదు మ్యాచ్ లు ఆడగా.. కేవలం 89 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. భారీ స్కోర్ లు ఈ టోర్నీలో చేసిన సందర్భాలు లేవు. అయినా గాని ఒత్తిడి సమయంలో కెప్టెన్ గా రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయాలు జట్టుకు ముఖ్యమని ఫ్యాన్స్ అంటున్నారు. ఎలాగైనా రోహిత్ కోలుకుని… సెమీఫైనల్ మ్యాచ్ ఆడాలని.. అతని గాయం తగ్గాలని క్రికెట్ ప్రేమికులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది