Virat Kohli : 7+18 ట్వీట్ తో సోషల్ మీడియాలో రచ్చ.. కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా..!
Virat Kohli : రన్‌మెషీన్‌గా అందరిచేత ప్రశంసలు పొందిన విరాట్ కోహ్లీ ఇటీవల ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా టీమిండియాలోకి వచ్చి, అతి తక్కువ కాలంలోనే జట్టులో మెయిన్ ప్లేయర్‌గా మారిపోయాడు విరాట్ కోహ్లీ… ఎమ్మెస్ ధోనీ నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న మాజీ కెప్టెన్, టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. ఎమ్మెస్ ధోనీ పార్టనర్‌షిప్ నెలకొల్పిన ఫోటోను షేర్ చేసిన విరాట్ కోహ్లీ… ‘ఈ వ్యక్తికి నమ్మకమైన డిప్యూటీగా ఉన్న రోజులు నా కెరీర్‌లో నేనెంతో ఎంజాయ్ చేసిన క్షణాలు.. మా పార్టనర్‌షిప్ ఎప్పుడూ నాకు స్పెషల్‌గానే ఉండిపోతుంది. 7+18 లవ్…’ అంటూ రాసుకొచ్చాడు..
వాస్తవానికి ధోని జెర్సీ నంబర్ 7 కాగా.. కోహ్లీది 18. దాంతో ఈ రెండింటి బంధాన్ని తెలియజేసేలా కోహ్లీ 7+18 ట్వీట్ చేశాడని భావించొచ్చు. అయితే సడెన్ గా ఈ ట్వీట్ ఎందుకు చేశాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాని ప్రమోషనల్ పోస్టులు చేయడానికి మాత్రమే వాడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ… ఈ ప్రయాణం తనకెంతో గర్వకారణమంటూ ఓ వీడియో పోస్టు చేశాడు…సడెన్‌గా క్రికెట్ కెరీర్‌లో జరిగిన విషయాల గురించి పోస్ట్ చేస్తుండడంతో రిటైర్మెంట్ గురించి షాక్ ఏమైనా ఇస్తాడేమోనని భయపడుతున్నారు అభిమానులు.
అసలే విరాట్ కోహ్లీకి ఈ మధ్య టైం అస్సలు బాలేదు. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన తర్వాత పెద్దగా మ్యాచులు ఆడడానికి కూడా ఆసక్తి చూపించలేదు విరాట్ కోహ్లీ.. గతేడాది టి20 ప్రపంచకప్ తర్వాత నుంచి కూడా కోహ్లీ క్రికెట్ కెరీర్ అనూహ్య మలుపులతో సాగుతోంది. తొలుత టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తనకు తానుగా తప్పుకోగా.. ఆ తర్వాత బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీనిపై అప్పట్లో బీసీసీఐ, కోహ్లీ మధ్య పెద్ద వివాదమే నడిచింది. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పి కేవలం ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ ఏదైనా సంచలనం నిర్ణయం తీసుకోబోతున్నాడా? అందుకే తన కెరీర్‌లో ముఖ్యమైన విషయాల గురించి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడా? అనేది అభిమానుల్లో వేల ప్రశ్నలు రేగేలా చేస్తోంది..
Being this man’s trusted deputy was the most enjoyable and exciting period in my career. Our partnerships would always be special to me forever. 7+18 ❤️ pic.twitter.com/PafGRkMH0Y
— Virat Kohli (@imVkohli) August 25, 2022