Virat Kohli : రిష‌బ్ పంత్ ఒంటి చేత్తో సిక్స‌ర్ కొట్ట‌డంతో వెరైటీ డ్యాన్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన విరాట్ కోహ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : రిష‌బ్ పంత్ ఒంటి చేత్తో సిక్స‌ర్ కొట్ట‌డంతో వెరైటీ డ్యాన్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన విరాట్ కోహ్లీ

Virat Kohli: భార‌త క్రికెట్‌లోని మూల‌స్తంభాల‌లో విరాట్ కోహ్లీ ఒక‌రు. ఆయ‌న త‌న కెప్టెన్సీలో ఇండియా టీంకి ఎన్నో విజ‌యాలు అందించాడు. ఇటీవ‌ల అన్ని ఫార్మాట్స్‌కి కెప్టెన్‌గా గుడ్ బై చెప్పి ఆశ్చర్య‌ప‌రిచాడు. కోహ్లీ ఇకపై ఏ ఫార్మాట్‌లోనైనా భారత కెప్టెన్‌గా ఉండకపోవచ్చు కానీ అతను మైదానంలో తన దూకుడును తగ్గించలేదు. పార్ల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వ‌న్డేలో భారత్ ఛేజింగ్‌లో బ్యాట్‌తో 51 పరుగులు చేయడానికి ముందు, కోహ్ల.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో త్రో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 January 2022,1:30 pm

Virat Kohli: భార‌త క్రికెట్‌లోని మూల‌స్తంభాల‌లో విరాట్ కోహ్లీ ఒక‌రు. ఆయ‌న త‌న కెప్టెన్సీలో ఇండియా టీంకి ఎన్నో విజ‌యాలు అందించాడు. ఇటీవ‌ల అన్ని ఫార్మాట్స్‌కి కెప్టెన్‌గా గుడ్ బై చెప్పి ఆశ్చర్య‌ప‌రిచాడు. కోహ్లీ ఇకపై ఏ ఫార్మాట్‌లోనైనా భారత కెప్టెన్‌గా ఉండకపోవచ్చు కానీ అతను మైదానంలో తన దూకుడును తగ్గించలేదు. పార్ల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వ‌న్డేలో భారత్ ఛేజింగ్‌లో బ్యాట్‌తో 51 పరుగులు చేయడానికి ముందు, కోహ్ల.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో త్రో చేయడంపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.

ఇక రెండో వ‌న్డేలో డ‌కౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ రిష‌బ్ పంత్ బ్యాటింగ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. రిషబ్ పంత్ తన మార్క్ దూకుడైన బ్యాటింగ్‌తో బౌండరీలు, సిక్సులతో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నేప‌థ్యంలో ఓ భారీ సిక్స్ కొట్టాడు. అలాంటి సిక్స్‌ను చూసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ షేకింగ్ డ్యాన్స్ చేస్తూ పంత్‌కు విషెస్ తెలిపాడు. కోహ్లీ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

virat kohli one hand dancem video viral

virat kohli one hand dancem video viral

Virat Kohli : కోహ్లీ డ్యాన్స్ కేక‌…

రెండో వ‌న్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ధావన్, కేఎల్ రాహుల్ కీలకమైన 63 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తరువాత వెంటవెంటనే వరుసగా ధావన్(29), విరాట్ కోహ్లీ(0) వికెట్లు పడ్డాయి. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ తన దూకుడుతో బౌండరీల వర్షం కురిపించాడు. రిష‌బ్ పంత్ ఔట్ అయిన వెంట‌నే మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ కూడా క్యూ క‌ట్టారు. అయితే సౌత్ ఆఫ్రికా భార‌త్ విధించిన ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా చేధించి వ‌న్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది