Jamun Fruit : అల్ల నేరేడు పండ్లను లొట్టలేసుకుంటూ తినేస్తున్నారా? వాటి వల్ల ఎంత ప్రమాదమో ముందు తెలుసుకోండి..!
Jamun Fruit : నేరేడు పండ్లను చూస్తేనే నోరూరుతుంది. అల్ల నేరేడు పండ్లు అన్నా.. జిన్నె పండ్లు అన్నా.. జామూన్ అన్నా ఒకటే. అల్ల నేరేడు పండ్లు ఎండాకాలం ముగిసే సమయానికి మార్కెట్ లో దర్శనమిస్తాయి. నల్లగా నిగనిగలాడుతూ కనిపించే ఈ పండ్లను చూడగానే నోరూరుతుంది. ఆ పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే.. చాలామంది వాటి సీజన్ రాగానే.. మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని మరీ తెగ తినేస్తుంటారు. అయితే.. ఏదైనా […]
Jamun Fruit : నేరేడు పండ్లను చూస్తేనే నోరూరుతుంది. అల్ల నేరేడు పండ్లు అన్నా.. జిన్నె పండ్లు అన్నా.. జామూన్ అన్నా ఒకటే. అల్ల నేరేడు పండ్లు ఎండాకాలం ముగిసే సమయానికి మార్కెట్ లో దర్శనమిస్తాయి. నల్లగా నిగనిగలాడుతూ కనిపించే ఈ పండ్లను చూడగానే నోరూరుతుంది. ఆ పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే.. చాలామంది వాటి సీజన్ రాగానే.. మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని మరీ తెగ తినేస్తుంటారు. అయితే.. ఏదైనా కూడా మితంగా తింటేనే ఆహారం.. అమితంగా తింటే విషం అని పెద్దలు చెప్పారు. అల్ల నేరేడు పండ్లు కూడా అంతే. వీటిని అమితంగా తీసుకుంటే కొందరికి మాత్రం కొన్ని సమస్యలను తీసుకొస్తుంది. అందరికీ కాదు కానీ.. కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నేరేడు పండ్లను అస్సలు ఎక్కువగా తీసుకోకూడదు. చాలా మితంగా తినాల్సి ఉంటుంది.
మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేసే ఇవే పండ్లు.. అమితంగా తీసుకుంటే.. ఆరోగ్యానికి చేటు చేస్తాయి. ఈ పండ్లు కొందరికి ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఎవరికి ఈ పండ్లు మంచివి కావు? ఎవరికి ఈ పండ్లు కీడు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Jamun Fruit : ఈ సమస్యలు ఉన్నవాళ్లు అల్ల నేరేడు పండ్లకు దూరంగా ఉండండి
ప్రస్తుతం చాలామందిని హైబీపీ సమస్య వేధిస్తోంది. హైబీపీ ఉన్నవాళ్లు నేరేడు పండ్లను అధికంగా తీసుకుంటే.. హైబీపీ కాస్త లోబీపీ అయిపోతుందట. ఎందుకంటే.. బ్లడ్ ప్రెషర్ ను జామూన్ ఫ్రూట్ ఒక్కసారిగా తగ్గించేస్తుంది. అందుకే.. హైబీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను చాలా మితంగా తీసుకోవాలి. ఏమాత్రం ఎక్కువైనా.. బీపీ తక్కువైపోతుంది. అలాగే.. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు.. ఎక్కువగా అల్ల నేరేడు పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం. అదే పనిగా అల్లనేరేడు పండ్లను తింటే.. మలబద్ధకం సమస్య ఇంకా ఎక్కువవుతుందట. దానికి కారణం.. అందులో ఉండే విటమిన్ సి. అది మలబద్ధకం సమస్యను ఇంకా పెంచుతుందట.
మీకు మొటిమలు ఎక్కువగా ఉన్నాయా? అయితే.. అల్లనేరేడు పండ్లకు కాస్త దూరంగా ఉండండి. ఎందుకంటే.. ఎక్కువగా అల్లనేరేడు పండ్లను తింటే.. మొటిమలు రావడంతో పాటు.. చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయట. మొటిమలు లేనివాళ్లకు కూడా మొటిమలు వస్తాయట. అందుకే.. ఎక్కువగా నేరేడు పండ్లను తినకూడదంటారు. నేరేడు పండ్ల వాసన కొంచెం వెరైటీగా ఉంటుంది. వాటి వాసన చూస్తేనే వికారం వస్తుంది. అలాంటి సమస్య ఉన్నవాళ్లు అల్ల నేరేడు పండ్లను తినకపోవడమే మేలు. వాటి వాసన పడని వాళ్లు వాటిని తింటే.. వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే.. పై సమస్యలు ఉన్నవాళ్లు నేరేడు పండ్లకు కాస్త దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఇది కూడా చదవండి ==> క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..!
ఇది కూడా చదవండి ==> చేతి వేళ్లను విరిచినప్పుడు టప్పున శబ్దం వస్తుంది ఎందుకో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> అనాస పువ్వు ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు.. దాని గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> ఇలా ఒక్కసారి ట్రై చేయండి… మతి మరుపును ఈజీగా జయించొచ్చు..!