Mahi V Raghav : వైఎస్‌ జగన్ గెలుపోటములతో నాకు సంబంధం లేదు…ఈ సినిమా అందుకే తీశా.. యాత్ర 2 డైరెక్టర్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahi V Raghav : వైఎస్‌ జగన్ గెలుపోటములతో నాకు సంబంధం లేదు…ఈ సినిమా అందుకే తీశా.. యాత్ర 2 డైరెక్టర్…!

 Authored By aruna | The Telugu News | Updated on :16 January 2024,10:06 am

ప్రధానాంశాలు:

  •  Mahi V Raghav : వైఎస్‌ జగన్ గెలుపోటములతో నాకు సంబంధం లేదు...ఈ సినిమా అందుకే తీశా.. యాత్ర 2 డైరెక్టర్...!

Mahi V Raghav : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జోరు గా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే విడుదలకు సిద్ధమైన యాత్ర 2 సినిమా తీవ్ర చర్చనియాంశంగా మారింది. ఇక ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు మహీ వి రాఘవ్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా గెలవకపోయినా యాత్ర 2 సినిమా వచ్చి ఉండేదని తెలియజేశారు.

అదేవిధంగా వైయస్సార్ మరణం తర్వాత జగన్ ఎదిగిన తీరు విధానంలో చాలా డ్రామా కనిపించిందని తెలియజేశారు. అందుకే యాత్ర 2 సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యానని తెలియజేశారు. ఇక ఇదే మాట జగన్ కు చెబితే నవ్వారట. అయితే 2018లో జగన్ ఓడిపోయిన కూడా యాత్ర 2 సినిమా తీసే వాళ్ళం అని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ఓడిపోయిన గెలిచిన యాత్ర 2 సినిమా తీయాలనే ఐడియా నా దగ్గర ఉంది. అయితే జగన్ గెలవడం అనేది కథపరంగా నాకు కాస్త ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి ఎండింగ్ దొరికింది. అదే 2018లో జగన్ ఓడిపోయి ఉంటే డిఫరెంట్ క్లైమాక్స్ వచ్చి ఉండేదని ఆయన తెలిపారు. అంతే తప్ప సినిమా మాత్రం కచ్చితంగా చేస్తాను..అంతేకాక సినిమాలో గెలుపు ఓటమి మినహాయించి మిగతా భాగం ఏది మారలేదు.

అదేవిధంగా యాత్ర సినిమాతో పోల్చి చూస్తే యాత్ర 2 సినిమా తీయడం చాలా కష్టంగా మరియు ఛాలెంజింగ్ అనిపించిందని డైరెక్టర్ రాగవ్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉంటున్న జగన్ పై సినిమా తీయడం నిజంగా చాలా కష్టమని దీని నుండి మంచి చెడు ఎదుర్కోవాలని తెలియజేశారు.ఇక సినిమాలో అతనిపై ఉన్న ద్వేషం అతడిపై చూపించే ప్రేమ విషయంలో కూడా విభిన్నమైన రేఖ ఉంటుంది. ఇక అలాంటి వ్యక్తిపై ఎంత గొప్ప సినిమా తీసిన 30% మంది దానిని చెత్తగానే పరిగణిస్తారు. అలాగే నేను ఎంత చెత్తగా తీసినప్పటికీ మరో 30 శాతం మంది అద్భుతంగా ఉందని చెబుతారు. అలాగే ఇదొక పొలిటికల్ సినిమా కాబట్టి దీనిని కథగా చూపించడం నాకు చాలెంజింగ్ అనిపించింది.

అదేవిధంగా జగన్ జీవితంలో ఉన్న వ్యక్తులందరూ ఈ సినిమాలో కనిపించరని దర్శకుడు తెలిపారు. ఇక ఈ సినిమా కథకు తగ్గట్టు ఫిక్షన్ జోడించుకొని పాత్రలని పెట్టారని ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు చరిత్రలో రాజకీయ నాయకుడు పై తీసిన సినిమాలు ఏవి కూడా గొప్పగా ఆడిన సందర్భాలు లేవని అదేవిధంగా యాత్ర 2 ను తాను ఎంత గొప్పగా తీసిన విమర్శలు వస్తాయని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. మరి ఈ యాత్ర 2 సినిమాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది